NTV Telugu Site icon

Rythu Bandhu : రైతులకు గుడ్ న్యూస్.. మరో 550కోట్లు విడుదల చేసిన సర్కార్

Rythubandhu

Rythubandhu

Rythu Bandhu : రైతులకు తెలంగాణ సర్కార్ శుభవార్త తీసుకొచ్చింది. నేడు వారి కోసం మరో రూ.550కోట్ల నిధులు విడుదల చేసింది. రైతు బంధు పథకంలో భాగంగా తెలంగాణ రైతులకు మంగళవారం మరో రూ.550.14 కోట్లు విడుదల చేసిందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. 11 లక్షల 306.38 ఎకరాలకు గాను 1,60,643 మంది రైతుల ఖాతాలలో జమ అయ్యేలా నిధులు విడుదల చేసినట్టు మంత్రి పేర్కొన్నారు. ఇప్పటి వరకు మొత్తం 62,45,700 మంది రైతుల ఖాతాలలో రూ.6351.22 కోట్లు జమ చేసినట్టు వెల్లడించారు.

Read Also: Folding House : ఈ ఇళ్లు ఎక్కడికైనా మడతపెట్టుకుని తీసుకువెళ్లొచ్చు

ఇక, బుధవారం జరిగే ఖమ్మం బీఆర్ఎస్ బహిరంగసభ దేశ రాజకీయ చరిత్రలో ఒక మలుపురాయిలా నిలవనున్నది అని జోస్యం చెప్పారు. ఖమ్మం సభలో సీఎం కేసీఆర్ సందేశం చారిత్రాత్మకం కాబోతుందన్నారు. నాడు తెలంగాణ కోసం, నేడు దేశం కోసం కేసీఆర్ ముందడుగు వేశారని నిరంజన్ రెడ్డి అన్నారు. అన్ని రంగాలను అమ్మేసినా కేంద్రం కన్ను ఇప్పుడు ఆహారరంగం మీద పడిందని మంత్రి నిరంజన్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ నాయకత్వంలో కేంద్రం కుట్రలను చేధిస్తామని చెప్పారు. తెలంగాణ వ్యవసాయ పథకాలు, సంక్షేమ పథకాలు దేశమంతటా అమలుకావాలని భారత ప్రజలు ఆశిస్తున్నారని నిరంజన్ రెడ్డి అన్నారు. ఇక, బీఆర్ఎస్ అడుగులు చూసి బీజేపీలో వణుకు పుడుతున్నదని, అందుకే తెలంగాణ మీద కక్షగట్టి నిధులు రాకుండా, రుణాలు అందకుండా అడ్డుపుల్లలు వేస్తున్నదని ఆరోపించారు. బీజేపీకి ప్రజలే సమాధానం చెబుతారని తెలిపారు.