RRR Movie: అంతర్జాతీయ వేదికపై భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన భారతీయ సినిమాలలో ‘ఆర్‌ఆర్ఆర్’ అత్యుత్తమమైనది. విజయేంద్ర ప్రసాద్ రచించిన మరియు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన ఎపిక్ యాక్షన్ డ్రామా ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర అగ్ర చిత్ర పరిశ్రమలలో చర్చనీయాంశంగా ఉంది. అది ‘ఆర్‌ఆర్ఆర్’కి ఉన్న క్రేజ్.. రేంజ్. ఎన్నో రికార్డులతో భారతీయ బాక్సాఫీస్‌ను షేక్ చేసి, విమర్శకుల ప్రశంసలతో హాలీవుడ్‌లో మెరిసిన ఈ చిత్రం జపాన్‌లో అడుగుపెట్టి వసూళ్ల సునామీ సృష్టిస్తోంది.
ఇటీవలే ఈ సినిమా జపాన్‌లోనూ విడుదలై అదరగొడుతోంది. తాజాగా ఈ సినిమా జపాన్‌లో మైండ్ బ్లోయింగ్ కలెక్షన్లతో దూసుకెళ్తోంది. బాలీవుడ్ చిత్రం 3 ఇడియట్స్ రికార్డును తిరగరాసిన సంగతి తెలిసిందే. భారీ వసూళ్లు నమోదు చేస్తున్న ఈ చిత్రం మళ్లీ అక్కడ రికార్డు నమోదు చేసినట్లు తెలుస్తోంది. జపాన్‌లో 250 మిలియన్ యెన్స్ వసూలు చేసిన ఫాస్టెస్ట్ ఇండియన్ సినిమాగా ఈ చిత్రం రికార్డు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రం కేవలం 3 వారాల్లోనే ఈ ఫీట్ అందుకుని రికార్డు సృష్టించినట్లు తెలుస్తోంది.
Former Miss World: టాలీవుడ్‌లోకి ప్రపంచ సుందరి!
జపాన్ దేశవ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ చిత్రం 44 నగరాల్లో 209 స్క్రీన్లలో, 31 ఐమాక్స్ కేంద్రాల్లో విడుదలై వసూళ్ల వర్షాన్ని కురిపిస్తోంది. మూడు వారాల్లోనే 250 మిలియన్ల జపాన్ యెన్‌లను వసూలు చేసి సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. ఇప్పటికే అక్కడ 3 ఇడియట్స్ లైఫ్ టైమ్ కలెక్షన్లు 170 మిలియన్ల రికార్డును తిరగరాసింది. ఫలితంగా జపాన్‌లో అత్యధిక వసూళ్లను మూడో భారతీయ చిత్రంగా నిలిచింది. 24 ఏళ్ల క్రితం రజినీకాంత్ నటించిన ముత్తు చిత్రం జపాన్‌లో 400 మిలియన్ల జపాన్ యెన్లు సాధించి ఇప్పటికీ అగ్రస్థానంలో నిలిచింది. అనంతరం బాహుబలి-2 300 మిలియన్లతో రెండో స్థానంలో ఉండగా.. తాజాగా 250 మిలియన్లతో ఆర్ఆర్ఆర్ మూడో స్థానానికి చేరింది. ఈ జాబితాలో రాజమౌళి తెరకెక్కించిన రెండు సినిమాలు ఉండటం గమనార్హం.
