Site icon NTV Telugu

‘RRR’ టీజర్ గ్లింప్స్ విడుదల వాయిదా

కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ హఠాన్మరణంతో సినీ పరిశ్రమ మొత్తం విషాదంలో మునిగిపోయింది. ఈ నేపథ్యంలో శుక్రవారం విడుదల కావాల్సిన ‘రౌద్రం రణం రుధిరం (RRR)’ టీజర్ గ్లింప్స్ వాయిదా పడింది. త్వరలో టీజర్ గ్లింప్స్ విడుదల తేదీపై క్లారిటీ ఇస్తామని RRR యూనిట్ తెలిపింది. ఈ టీజర్ గ్లింప్స్ నిడివి 40 సెకన్ల పాటు ఉంటుందని తెలుస్తోంది. జనవరి 7న విడుదల కానున్న ఈ సినిమా టీజర్‌ త్వరలో విడుదల చేయాలని భావించారు. అందులో భాగంగా ముంబై వేదికగా శుక్రవారం ఈ మూవీ టీజర్ గ్లింప్స్ విడుదల కావాల్సి ఉంది.

Read Also: మల్టీప్లెక్స్ దిగ్గజంతో కలిసి “ఆర్ఆర్ఆర్” అదిరే ప్లాన్

మరోవైపు ఈ సినిమా ప్రమోషన్‌లను భారీ ఎత్తున నిర్వహించాలని దర్శకుడు రాజమౌళి సన్నాహాలు చేపట్టారు. ఇందులో భాగంగా ప్రముఖ మల్టీప్లెక్స్ పీవీఆర్ సినిమాస్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు. దీంతో దేశంలోని పీవీఆర్​కు చెందిన 850కి పైగా స్క్రీన్‌లతో పాటు 70కి పైగా నగరాల్లో ఉన్న 170కి పైగా బిల్డింగ్​లపై PV’RRR’ అనే పేరు దర్శనమివ్వనుందని ‘ఆర్ఆర్ఆర్’ చిత్రబృందం ట్వీట్ చేసింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ హీరోలుగా దాదాపు రూ.400 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు.

Exit mobile version