మల్టీప్లెక్స్ దిగ్గజంతో కలిసి “ఆర్ఆర్ఆర్” అదిరే ప్లాన్

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న క్రేజీ మల్టీస్టారర్ “ఆర్ఆర్ఆర్”. రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా జనవరి 7న విడుదలకు సిద్ధమవుతోంది. అయితే సినిమా ప్రమోషన్ల కోసం చిత్రబృందం రచిస్తున్న సరికొత్త ప్రణాళికలు మార్కెటింగ్ నిపుణులను సైతం అబ్బుర పరుస్తున్నాయి. తన సినిమాలను ఎలా మార్కెటింగ్ చేసుకోవాలో రాజమౌళికి బాగా తెలుసు. ఈ నేపథ్యంలో “ఆర్ఆర్ఆర్”ను దేశవ్యాప్తంగా విడుదల చేయడానికి మల్టీప్లెక్స్ దిగ్గజం పివిఆర్ సినిమాస్‌తో చేతులు కలుపుతున్నారు మేకర్స్.

Read Also : ముంబైలో “ఆర్ఆర్ఆర్” స్పెషల్ ఈవెంట్… గ్లింప్స్ రిలీజ్ ?

వ్యాపార భాగస్వామిగా పివిఆర్ దేశవ్యాప్తంగా ఉన్న తమ అన్ని థియేటర్లలో “ఆర్ఆర్ఆర్” చిత్రాన్ని ప్రమోట్ చేస్తుంది. ఆగస్టు 2019లో ఇది భారతదేశంలో 800 స్క్రీన్‌ల మైలురాయిని దాటింది. ఇక ఇతర దిగ్గజ మల్టీప్లెక్స్ లతో కూడా “ఆర్ఆర్ఆర్” టై అప్ అవ్వబోతోందని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ముంబైలో బిగ్ ఈవెంట్ ను ప్లాన్ చేశారు మేకర్స్. ఈ ఈవెంట్ లో మిగతా వివరాలు, అలాగే ‘ఆర్ఆర్ఆర్’ గ్లింప్స్ కూడా విడుదల చేయబోతున్నట్టు సమాచారం.

Related Articles

Latest Articles