NTV Telugu Site icon

RRR : ‘ట్రిపులార్’ కి తిరుగులేదు.. జపాన్ లో ఇంకా హౌస్ ఫుల్

Rrr

Rrr

RRR : రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటించిన RRR చిత్రం ఎంతటి సంచలన విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించిన ఈ సినిమాలో ‘నాటు నాటు’ అనే పాటకి ఇటీవల ఆస్కార్ అవార్డ్ కూడా వచ్చింది. తెలుగు చిత్ర పరిశ్రమ కి చాలా సంవత్సరాల తర్వాత ఆస్కార్ అవార్డు రావడంతో చిత్ర యూనిట్ పై సినీ ప్రేక్షకులంతా ప్రశంసల వర్షం కురిపించారు.

Read Also: Haryana : చేతులు, తర్వాత తల నరికి అత్యంత కిరాతకంగా భార్యను చంపిన భర్త

ఈ చిత్రంతో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు గ్లోబల్ స్టార్స్ గా మారిపోయారు. ఈ చిత్రం థియేటర్స్ లో రిలీజ్ అయ్యి ఏడాది కావస్తుంది. ఇంకా ఈ చిత్రం విడుదల సమయంలో అంతా ఎలా ఉందో ఇప్పటికీ అలాగే ఉంది. ఇక ఈ సినిమా ఆస్కార్ అవార్డు కొట్టిన తర్వాత కూడా థియేటర్స్ లో రన్ ఇంకా ఆగలేదు. ముఖ్యంగా జపాన్ లో అయితే ఇప్పటికీ బుకింగ్స్ లో టాప్ 10 మూవీస్ లో ఒకటిగా RRR కొనసాగుతూ ఉంది. 200వ రోజు దగ్గరకి వస్తున్నా అక్కడ థియేటర్స్ లో హౌస్ ఫుల్స్ బోర్డులు కనిపిస్తున్నాయి. ఇక కొన్ని రోజుల్లో అయితే జపాన్ రన్ పై 100 రోజుల పోస్టర్ ఎలా చూసామో 200 రోజుల పోస్టర్ కూడా చూసేలా ఉన్నామని చెప్పాలి.

Read Also: Dandakaranya : దండకారణ్యంలో శరదృతువు శాపం…13 ఏళ్లుగా నక్సలైట్ల దాడికి వ్యూహం