NTV Telugu Site icon

RRR: జపాన్ లో జయకేతనం ఎగరేయబోతున్న రామ్ అండ్ భీమ్!

Rrr

Rrr

ప్రపంచవ్యాప్తంగా మార్చి 24న విడుదలైన ‘ఆర్.ఆర్.ఆర్.’ మూవీ ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. అంతేకాదు ఆస్కార్ బరిలో దిగే ఆస్కారాన్ని ఈ సినిమా వదులుకోదల్చుకోలేదు. భారతదేశం తరఫున అధికార చిత్రంగా నామినేట్ కాకపోయినా… అమెరికాలోని థియేటర్లలో ప్రదర్శితమై నామినేషన్ ఆశలను ఇంకా సజీవంగానే ఉంచుకుంది. ఇదిలా ఉంటే అక్టోబర్ 21వ తేదీ ఈ సినిమా జపాన్ లో విడుదల కాబోతోంది.

 

అయితే విశేషం ఏమంటే స్వయంగా ఈ చిత్ర కథానాయకులు జూనియర్ ఎన్టీయార్, రామ్ చరణ్ తో పాటు దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి సైతం జపాన్ కు వెళ్ళబోతున్నారని తెలుస్తోంది. ఈ అక్టోబర్ 21న టోక్యో లోని షింజుకు సిటీలోనూ, ఆ మర్నాడు 22న కవాసాకీ లోనూ జరిగే ‘ట్రిపుల్ ఆర్’ మూవీ స్క్రీనింగ్స్ లో ఈ ముగ్గురు హాజరుకాబోతున్నారనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే ‘ఆర్.ఆర్.ఆర్.’ టీమ్ మాత్రం ఇంకా అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించలేదు!