NTV Telugu Site icon

RRR Movie: తగ్గని ట్రిపుల్ఆర్ క్రేజ్.. జపాన్ బెస్ట్ చిత్రాల జాబితాలో చోటు

Rrr Movie

Rrr Movie

RRR Movie: విడుదలై పదినెలలవుతున్నా ట్రిపుల్ఆర్ క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన చోటల్లా రికార్డులు సృష్టిస్తూ సెన్సేషన్ సృష్టిస్తోంది. ఆస్కార్ అవార్డు గడపదాకా వెళ్లిన ట్రిపుల్ఆర్ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. చిత్రంలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ల నటనకు జనం నీరాజనం పలుకుతున్నారు. దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన తీరుకు హెట్సాఫ్ అంటున్నారు ప్రేక్షకులు. మరి ప్రపంచ వ్యాప్తంగా కూడా సెన్సేషన్ ని రేపిన ఈ చిత్రం గ్లోబల్ గా ఇంకా ఎన్ని రికార్డులు సృష్టిస్తోందో చూడాలి. ఇది ఇలా ఉంటే, ఇక గత కొన్నాళ్ల కితమే జపాన్ దేశంలో భారీ హైప్ తో రిలీజ్ అయ్యిన ఈ చిత్రం అక్కడ అయితే ఇండియా సినిమాల నుంచి బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచి ఆల్ టైం రికార్డు నెలకొల్పింది. మరి అక్కడ హైయెస్ట్ గ్రాసర్ గా నిలవడమే కాకుండా జపాన్ ఫేమస్ అండ్ లార్జెస్ట్ మూవీ సైట్ లో కూడా సత్తా చాటింది. అక్కడ హాలీవుడ్ చిత్రాల సరసన ట్రిపుల్‎ఆర్ టాప్ 3 చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. దీనితో మేకర్స్ ఈ విషయాన్ని పంచుకొని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ భారీ చిత్రంలో సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి ఇచ్చిన సంగీతం కూడా గ్లోబల్ వైడ్ భారీ ఆదరణ అందుకొని ఆస్కార్ వరకు వెళ్లిన సంగతి తెలిసిందే.

Show comments