Indian Railway: నిరుద్యోగులకు రైల్వేశాఖ కీలక అలర్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎన్నికల ముందు ఆయా ప్రభుత్వాలు ఉద్యోగ ప్రకటనలు విడుదల చేయడం సహజంగా జరుగుతుంటాయి. పైగా నిరుద్యోగులు కూడా ఉద్యోగ ప్రకటనలు కూడా ఎదురుచూస్తుంటారు. ఇలాంటి సమయంలో నిరుద్యోగుల బలహీనతను ఆసరాగా చేసుకుని కొందరు కేడీగాళ్లు మోసాలకు తెగబడుతున్నారు.
త్వరలోనే దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఇలాంటి సమయంలో నిరుద్యోగుల్ని మోసగించే ఓ ప్రకటన ఇప్పుడు సోషల్ మీడియా (Social Media)లో చక్కర్లు కొడుతోంది. అయితే ఈ ప్రకటనను కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చింది.
Also Read
- Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
- Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
- Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
- Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
రైల్వే శాఖ (RRB)లో 4,660 ఉద్యోగాలంటూ చక్కర్లు కొడుతున్న ఓ ఉద్యోగ ప్రకటనపై కేంద్రం స్పందించింది. ఆ ఉద్యోగ ప్రకటన నకిలీదని తేల్చిచెప్పింది. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF), రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్‌లో ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి రైల్వేశాఖ ఏప్రిల్ 15 నుంచి మే 14వరకు ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరిస్తుందని పేర్కొంటూ విస్తృతంగా జరుగుతున్న ప్రచారాన్ని ఖండించింది.
ఈ మధ్య కాలంలో ఎలాంటి ఉద్యోగ ప్రకటనను రైల్వే మంత్రిత్వశాఖ విడుదల చేయలేదని కేంద్రం స్పష్టం చేసింది. ఆర్‌పీఎఫ్‌లో 452 ఎస్సై, 4,208 కానిస్టేబుల్ పోస్టుల సంఖ్య, వేతనం, వయో పరిమితి, విద్యార్హతలు, ఉద్యోగ నియామక ప్రక్రియ, దరఖాస్తు రుసుం తదితర అంశాలతో కూడిన ఈ నకిలీ ప్రకటనను ఎవరూ నమ్మొద్దని నిరుద్యోగులకు కేంద్రం విజ్ఞప్తి చేసింది.

FAKE JOBS
- Tags
- constable
- Recruitment Notice
- rpf
- RRB
- si
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!