RR vs SRH: నేడు వర్షం పడితే.. ఏ జట్టు క్వాలిఫైర్-2 కు చేరుకుంటుందంటే.?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RR vs SRH: ఐపీఎల్ 2026 సీజన్ చివరి దశకు చేరుకుంది. మరో మూడు మ్యాచ్ లతో ఈ మెగా టోర్నీ ముగియనుండగా.. నేడు న్యూ చండీగఢ్ వేదికగా జరిగే ఎలిమినేటర్ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. అయితే మ్యాచ్‌కు ముందు అభిమానులను వెంటాడుతున్న ప్రధాన ప్రశ్న ఒక్కటే. అదే.. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే ఏ జట్టు క్వాలిఫయర్-2కు చేరుకుంటుందని?
ఐపీఎల్ నిబంధనల ప్రకారం.. ఫైనల్ మ్యాచ్‌కు మాత్రమే రిజర్వ్ డే ఉంటుంది. ఎలిమినేటర్, క్వాలిఫయర్-1, క్వాలిఫయర్-2 మ్యాచ్ లకు రిజర్వ్ డే లేదు. దీంతో వర్షం లేదా ఇతర కారణాలతో మ్యాచ్ పూర్తిగా రద్దయితే.. లీగ్ స్టేజిలో పాయింట్ల పట్టిక ఆధారంగా మెరుగైన స్థానంలో ఉన్న జట్టుకే తదుపరి దశకు అర్హత లభిస్తుంది. ఈ లెక్కన చూస్తే.. ఒకవేళ ఎలిమినేటర్ మ్యాచ్ రద్దయితే సన్ రైజర్స్ హైదరాబాద్ క్వాలిఫయర్-2కు చేరుకుంటుంది. ఎందుకంటే, లీగ్ దశలో హైదరాబాద్ జట్టు 14 మ్యాచ్‌ల్లో 9 విజయాలతో 18 పాయింట్లు సాధించి టాప్-3లో నిలిచింది. రన్‌రేట్ కారణంగా మూడో స్థానానికి పరిమితమైనా.. నాలుగో స్థానంలో నిలిచిన రాజస్థాన్ రాయల్స్ కంటే మెరుగైన స్థితిలో ఉంది. రాజస్థాన్ మాత్రం 14 మ్యాచ్‌ల్లో 8 విజయాలతో ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది.
Also Read
- Ragi Sweet Pongal: రొటీన్ స్వీట్లకు గుడ్ బై.. నోటికి రుచి, ఒంటికి బలాన్నిచ్చే రాగి తీపి పొంగలి చేసేయండిలా!
- Temba Bavuma: ఏంటి బవుమా అంత కోపం.. కొట్టేస్తావా ఏంటి.? వైరల్ వీడియో..
- Government Bank Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రభుత్వ బ్యాంక్‌లో భారీగా పోస్టులు.. డిగ్రీ ఉంటే చాలు..!
- SBI ATM Rules Change: ఎస్బీఐ ఖాతాదారులకు అలర్ట్.. రేపటి నుంచి ATM నిబంధనల్లో కీలక మార్పులు
అయితే ప్రస్తుతం వాతావరణ పరిస్థితులను బట్టి చూస్తే ఎలిమినేటర్ మ్యాచ్ కు పెద్దగా వర్ష ముప్పు కనిపించడం లేదు. దీంతో అభిమానులు పూర్తి మ్యాచ్‌ను ఆస్వాదించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అయితే ఫైనల్ మ్యాచ్ విషయంలో మాత్రం ఐపీఎల్ ప్రత్యేక నిబంధనలు అమల్లో ఉంటాయి. మే 31న జరగాల్సిన ఫైనల్ కు రిజర్వ్ డే కేటాయించారు. ఒకవేళ మ్యాచ్ పూర్తిగా జరగకపోయినా లేదా కనీసం ఐదు ఓవర్ల ఆట కూడా సాధ్యంకాకపోయినా.. మరుసటి రోజు అయిన జూన్ 1న మ్యాచ్ నిర్వహిస్తారు. రిజర్వ్ డే రోజూ మ్యాచ్ సాధ్యం కాకపోతే.. లీగ్ దశలో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన జట్టును ఐపీఎల్ 2026 ఛాంపియన్‌గా ప్రకటిస్తారు.
తాజావార్తలు
-
Ragi Sweet Pongal: రొటీన్ స్వీట్లకు గుడ్ బై.. నోటికి రుచి, ఒంటికి బలాన్నిచ్చే రాగి తీపి పొంగలి చేసేయండిలా!
-
Temba Bavuma: ఏంటి బవుమా అంత కోపం.. కొట్టేస్తావా ఏంటి.? వైరల్ వీడియో..
-
Government Bank Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రభుత్వ బ్యాంక్‌లో భారీగా పోస్టులు.. డిగ్రీ ఉంటే చాలు..!
-
SBI ATM Rules Change: ఎస్బీఐ ఖాతాదారులకు అలర్ట్.. రేపటి నుంచి ATM నిబంధనల్లో కీలక మార్పులు
-
IND vs WI 2nd ODI: టీమిండియా బౌలర్లకు ఎగిరి గంతేసే వార్త.. రెండో వన్డే నుంచి విండీస్ సెంచరీ హీరో ఔట్!
ట్రెండింగ్
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?