నేటి మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ను ఎంచుకోగా., సన్‌రైజర్స్ హైదరాబాద్ మొదట బ్యాటింగ్ చేసింది. ఇక ఎస్ఆర్హెచ్ నిర్ణిత 20 ఓవర్లులో 9 వికెట్స్ కోల్పోయి 175 పరుగులను మాత్రమే చేయగలిగారు. హెన్రిచ్ క్లాసెన్ హాఫ్ సెంచరీతో సన్‌రైజర్స్ ఈ మాత్రమైనా స్కోర్ ను అందుకుంది. ఇక ఓపెనర్లు అభిషేక్ శర్మ వచ్చి రాగానే స్కోర్ బోర్డును పర్గెతించాడు. కాకపోతే మొదటి ఓవర్ లోనే 5 బంతుల్లో 12 పరుగులు మాత్రమే చేసి వెను తిరిగాడు. ఇక మరోవైపు ట్రావిస్ హెడ్ ఈ రోజు కాస్త ఆచూతూచి ఆడగా చివరకు 28 బంతులు ఆడి 34 పరుగులను మాత్రమే జోడించాడు.
T20 World Cup 2024: ఆటగాడిగా కాదు.. ఈసారి కామెంటేటర్గా కనపడనున్న దినేశ్ కార్తీక్..
ఇక ఎస్ఆర్హెచ్ మిగితా బ్యాట్స్మెన్స్ విషయానికి వస్తే.. రాహుల్ త్రిపాఠి 37, ఐడెన్ మార్క్రామ్ 1, హెన్రిచ్ క్లాసెన్ 50, నితీష్ కుమార్ రెడ్డి 5, అబ్దుల్ సమద్ 0, షాబాజ్ అహ్మద్ 18, జయదేవ్ ఉనాద్కత్ 5, పాట్ కమిన్స్ 5 నాటౌట్ పరుగులను సాధించారు. ఇక రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, అవేష్ ఖాన్ 3 వికెట్స్ సాధించగా., సందీప్ శర్మ 2 వికెట్లను తీసుకున్నారు.