RR vs RCB: ఐపీఎల్ -16లో భాగంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో ఆర్సీబీ జట్టు తొలుత బ్యాటింగ్ చేయనుంది. పంజాబ్ కింగ్స్‌పై 24 పరుగుల తేడాతో విజయం సాధించిన ఊపులో బెంగుళూరు జట్టు శాంసన్ సేనతో తలపడుకోంది. మరో వైపు లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 10 పరుగుల తేడాతో ఓటమిని చవిచూసింది. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నారు.
Read Also: Salman Khan: సార్ మిమ్మల్ని ఎవరో మోసం చేశారు…
ఆర్సీబీ రెగ్యులర్ కెప్టెన్ డుప్లెసిస్ పక్కటెముక గాయంతో బాధపడుతున్నాడు. దీంతో అతన బ్యాటర్‌గా మాత్రమే ఆడుతున్నాడు. కెప్టెన్సీ వ్యవహారాలు కోహ్లీకి అప్పగించాడు. ఇదిలా ఉండగా.. రాజస్థాన్ రాయల్స్ జట్టు ఇప్పటివరకు మొత్తం ఆరు మ్యాచ్‌లు ఆడి నాలుగింట విజయాలు సాధించింది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతున్నది. ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కూడా ఆరు మ్యాచ్‌లు ఆడి.. మూడు విజయాలు, మూడు పరాజయాలతో పాయింట్స్ టేబుల్‌లో ఆరో స్థానంలో ఉన్నది