ఐపీఎల్ 2024లో భాగంగా.. ఈరోజు కోల్కతా నైట్ రైడర్స్-రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరుగనుంది. ఈడెన్ గార్డెన్ వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. అందులో భాగంగా టాస్ గెలిచిన రాజస్థాన్ ముందుగా.. బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ పాయింట్ల పట్టికలో మొదటి, రెండో స్థానాల మధ్య ఉన్న జట్ల మధ్య జరుగుతుండటంతో ఆసక్తికరంగా ఉండనుంది. సంజు సేన 6 మ్యాచ్‌లు ఆడి ఐదు మ్యాచ్‌ల్లో గెలిచి అగ్రస్థానంలో ఉంది. కోల్‌కతా ఐదు మ్యాచ్‌ల్లో నాలుగింట నెగ్గి రెండో స్థానంలో ఉంది. ఇరుజట్లలో హిట్టర్లు ఉండటంతో భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది. మరి ఈ మ్యాచ్‌లో ఏ జట్టు పైచేయి సాధిస్తుందో చూడాలి. ఈడెన్ గార్డెన్స్‌లో మాత్రం కోల్‌కతా ఆధిపత్యం చలాయించింది. ఈ మైదానంలో ఇరుజట్ల మధ్య 9 మ్యాచ్‌లు జరగ్గా కోల్‌కతా 6 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. మిగిలిన మ్యాచ్‌ల్లో రాజస్థాన్ గెలిచింది.
కోల్కతా ప్లేయింగ్ ఎలెవన్:
ఫిల్ సాల్ట్ (వికెట్ కీపర్), వెంకటేష్ అయ్యర్, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), సునీల్ నరైన్, అంగ్క్రిష్ రఘువంశీ, రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, మిచెల్ స్టార్క్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రానా.
రాజస్థాన్ ప్లేయింగ్ ఎలెవన్:
యశస్వి జైస్వాల్, రోవ్మాన్ పావెల్, సంజు శాంసన్(కెప్టెన్/వికెట్ కీపర్), రియాన్ పరాగ్, షిమ్రాన్ హెట్మెయర్, ధృవ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, అవేష్ ఖాన్, కుల్దీప్ సేన్, యుజ్వేంద్ర చాహల్