Site icon NTV Telugu

Royal Enfield Recall: ‘రాయల్ ఎన్‌ఫీల్డ్‌’ బైక్స్ వెనక్కి.. కారణం ఏంటంటే?

Royal Enfield

Royal Enfield

Royal Enfield Recall Globally: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ‘రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌’ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మోటార్‌ సైకిళ్లను వెనక్కి రప్పిస్తోంది. 2022 నవంబర్‌ నుంచి 2023 మార్చి మధ్య తయారైన అన్ని వాహనాలకు గ్లోబల్ రీకాల్ జారీ చేసింది. మోటార్‌ సైకిల్‌ వెనక భాగంలో ఉండే రిఫ్లెక్టర్‌లో లోపమే ఇందుకు కారణం. రిఫ్లెక్టర్‌లు కంపెనీ ప్రమాణాలకు అనుగుణంగా లేకపోవడంతోనే రీకాల్ చేసినట్లు కంపెనీ పేర్కొంది.

రిఫ్లెక్టర్‌ల కారణంగా మోటార్‌ సైకిల్ పనితీరుపై ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండదని రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ కంపెనీ తెలిపింది. ఈ రీకాల్‌ ప్రక్రియను కంపెనీ దశల వారీగా చేపట్టనుంది. ముందుగా దక్షిణ కొరియా, అమెరికా, కెనడాలో రీకాల్‌ ప్రక్రియను చేపట్టనున్నారు. ఆపై భారత్‌, బ్రెజిల్, లాటిన్‌ అమెరికా, యూరప్‌, యూకేలో కొనసాగనుంది. కంపెనీ ప్రతినిధులే వినియోగదారులకు రీకాల్‌కు సంబంధించిన సమాచారాన్ని అందిస్తారు.

Also Read: Mohammed Siraj Catch: గాల్లో వెనక్కి డైవ్ చేస్తూ.. నెక్ట్స్ లెవెల్ క్యాచ్ పట్టిన సిరాజ్!

కేవలం 15 నిమిషాల్లోనే రిఫ్లెక్టర్ల మార్పిడి చేసి వాహనాన్ని ఇస్తామని రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ కంపెనీ పేర్కొంది. రిఫ్లెక్టర్‌ల రీప్లేస్‌మెంట్ వినియోగదారులకు ఉచితంగా అందించబడుతుంది. అయితే ఎన్ని వాహనాలు రీకాల్ చేపడుతున్నదీ మాత్రం కంపెనీ వెల్లడించలేదు. రిఫ్లెక్టర్‌ల రీప్లేస్‌మెంట్ ప్రక్రియకు భారత్‌లో మరికొంత కాలం పట్టనుంది.

Exit mobile version