దేశంలో GST రేట్ల మార్పు తర్వాత, ఆటోమొబైల్ కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలను సవరించి కొత్త ధరలను విడుదల చేస్తున్నాయి. అదే క్రమంలో, రాయల్ ఎన్ఫీల్డ్ తన మోటార్‌సైకిళ్ల కొత్త ధరలను విడుదల చేసింది. సెప్టెంబర్ 22 నుండి నుంచి తగ్గిన ధరలు అమల్లోకి వస్తాయని తెలిపింది. రాయల్ ఎన్ఫీల్డ్ తన పోర్ట్‌ఫోలియోలోని అన్ని మోటార్‌సైకిళ్ల ధరలను విడుదల చేసింది. కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం.. హంటర్ 350 కొత్త ధర రూ.1.37 లక్షల నుండి రూ.1.66 లక్షల మధ్య ఉంటుంది. బుల్లెట్ 350 కొత్త ధర రూ.1.62 లక్షల నుండి రూ.2.02 లక్షల మధ్య ఉంటుంది. క్లాసిక్ 350 కొత్త ధర రూ.1.81 లక్షల నుండి రూ.2.15 లక్షల మధ్య ఉంటుంది. మెటియోర్ 350 కొత్త ధర రూ.1.91 లక్షల నుండి రూ.2.13 లక్షల మధ్య ఉంటుంది. గోవాన్ క్లాసిక్ కొత్త ధర రూ.2.17 లక్షల నుండి రూ.2.20 లక్షల మధ్య ఉంటుంది.
Also Read:Madharaasi : శివకార్తికేయన్ ‘మదరాసి’ ఓటీటీ స్టీమింగ్ డేట్ ఇదే..
350 సిసి వరకు మోటార్ సైకిళ్ల ధర తగ్గింపుతో పాటు, పెద్ద ఇంజిన్లు కలిగిన మోటార్ సైకిళ్ల ధరను తయారీదారు పెంచారు. స్క్రామ్ కొత్త ధర రూ. 2.23 లక్షల నుండి రూ. 2.30 లక్షలకు. గెరిల్లా కొత్త ధర రూ. 2.56 లక్షల నుండి రూ. 2.72 లక్షలకు. హిమాలయన్ కొత్త ధర రూ. 3.05 లక్షల నుండి రూ. 3.19 లక్షలకు. ఇంటర్‌సెప్టర్ కొత్త ధర రూ. 3.32 లక్షల నుండి రూ. 3.62 లక్షలకు. కాంటినెంటల్ జిటి కొత్త ధర రూ. 3.49 లక్షల నుండి రూ. 3.78 లక్షలకు. క్లాసిక్ 650 కొత్త ధర రూ. 3.61 లక్షల నుండి రూ. 3.75 లక్షలకు. షాట్‌గన్ కొత్త ధర రూ. 3.94 లక్షల నుండి రూ. 4.08 లక్షలకు. బేర్ 650 కొత్త ధర రూ. 3.71 లక్షల నుండి రూ. 3.93 లక్షలకు. సూపర్ మీటియోర్ కొత్త ధర రూ.3.98 లక్షల నుండి రూ.4.32 లక్షల వరకు ఎక్స్-షోరూమ్ ఉంటుంది. ఈ మోటార్ సైకిళ్ల ధర రూ.15 వేలు పెరిగి రూ.29 వేలకు చేరుకుంది.
