NTV Telugu Site icon

Royal Enfield Classic 650: కుర్రాళ్లు గెట్ రెడీ.. రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి క్రేజీ బైక్ రిలీజ్.. ధర ఎంతంటే?

Royal

Royal

రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ లకు మార్కెట్ లో ఉండే క్రేజే వేరు. యూత్ కు డ్రీమ్ బైక్ కూడా. కొంటే రాయల్ ఎన్పీల్డ్ బైక్ కొనాలి అని వెయిట్ చేసే వాళ్లు ఎందరో ఉన్నారు. అలాంటి వారికి గుడ్ న్యూస్. రాయల్ ఎన్ఫీల్డ్ 650cc విభాగంలో కొత్త బైక్‌ను విడుదల చేసింది. రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 650 బైక్‌ను భారత మార్కెట్లో అఫీషియల్ గా విడుదల చేసింది. క్లాసిక్ డిజైన్‌, ఆధునిక ఫీచర్లతో అట్రాక్ట్ చేస్తోంది. ఈ బైక్ ధర ఎంత? ఎలాంటి ఫీచర్లు అందించారు. ఆ వివరాలు మీకోసం..

Also Read:Viral Video: బెడ్రూంలోకి ఆవు, ఎద్దు.. కప్‌బోర్డులో చిక్కుకున్న మహిళ.. వైరల్ వీడియో..

రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 650 లో 648 సిసి సామర్థ్యం గల ట్విన్ సిలిండర్ ఎయిర్/ఆయిల్ కూల్డ్ ఇంజిన్ అమర్చారు. ఈ బైక్ 47 హార్స్‌పవర్, 52.3 న్యూటన్ మీటర్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్‌లో 14.7 లీటర్ల సామర్థ్యం గల ఫ్యుయల్ ట్యాంక్ ఉంది. ఈ ఇంజిన్‌తో బైక్‌లో ఆరు-స్పీడ్ గేర్‌బాక్స్ అనుసందానించారు. ఈ కొత్త బైక్‌లో సెమీ-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ట్రిపాన్ నావిగేషన్, USB ఛార్జర్, స్లిప్ అండ్ అసిస్ట్ క్లచ్, 18, 19 అంగుళాల అల్లాయ్ వీల్స్, LED హెడ్‌లైట్, LED టెయిల్ లైట్, గేర్ పొజిషన్ ఇండికేటర్ వంటి ఫీచర్లను అందించారు.

Also Read:US visa: ఆ కారణంతో.. భారత్‌లో 2,000 వీసా అపాయింట్ మెంట్స్‌ను రద్దు చేసిన అమెరికా

రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 650ని రాయల్ ఎన్‌ఫీల్డ్ మూడు వేరియంట్లలో, నాలుగు కలర్ ఆప్షన్స్ లో విడుదల చేసింది. ఈ బైక్ యొక్క బేస్ వేరియంట్‌ ఎక్స్-షోరూమ్ ధర రూ. 3.37 లక్షలు. క్లాసిక్ వేరియంట్‌ను టీల్ కలర్‌లో రూ. 3.41 లక్షల ధరకు కొనుగోలు చేయవచ్చు. దీని టాప్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 3.50 లక్షలు. రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 650 లాంచ్‌తో పాటు బుకింగ్ కూడా ప్రారంభమైంది. డెలివరీ ఏప్రిల్ 2025 నుంచి ప్రారంభమవుతుంది. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ డీలర్‌షిప్‌ల ద్వారా ఈ బైక్‌ను బుక్ చేసుకోవచ్చు.