డుగు.. డుగు.. అబ్బా ఈ సౌండ్ అంటే కుర్రాళ్లకు మహా ఇష్టం.. రాయల్ ఎన్‌ఫీల్డ్ బండి మీద కూర్చొగానే రాజసం వచ్చేస్తుందని యువత చెబుతుంటారు.. ఇక యూత్ ఆలోచనలకు తగ్గట్లే ఆయా కంపెనీ కొత్త ఫీచర్లతో కొత్త బైకులను మార్కెట్ లోకి విడుదల చేస్తుంది.. తాజాగా మరో కొత్త బైకును మార్కెట్ లోకి విడుదల చేసింది.. ఆ బండే రాయల్ ఎన్‌ఫీల్డ్ షాట్‌గన్ 650 మోటోవర్స్ ఎడిషన్.. ఈ కొత్త బైక్ ధర రూ. 4.25 లక్షలు (ఎక్స్-షోరూమ్)తో అందుబాటులో ఉంది. సాధారణ వేరియంట్‌ల కన్నా ముందుగా లాంచ్ అయిన పరిమిత ఎడిషన్ వెర్షన్. ఈ కస్టమ్ బైక్ 25 యూనిట్లు మాత్రమే అమ్మకానికి ఉండగా.. ఆసక్తి గల వినియోగదారులు నవంబర్ 25 అర్ధరాత్రి వరకు బుకింగ్‌కు చేసుకోవచ్చు..
కలర్ ఫుల్ తో కలర్ ఆప్షన్లతో గ్రాఫిక్ మోడల్ మళ్లీ తయారు చేయకపోవచ్చు. ఈ పరిమిత ఎడిషన్ డెలివరీలు జనవరి 2024లో ప్రారంభమవుతాయి. నియో-రెట్రో మోటార్‌సైకిల్ ఎస్‌జీ 650 కాన్సెప్ట్ నుంచి ప్రేరణ పొందింది. ఈ ప్రత్యేక ఎడిషన్ కస్టమ్-డిజైన్, హ్యాండ్-పెయింటెడ్ బాడీ ప్యానెల్‌లను కలిగి ఉంది. గ్రేడియంట్, నియాన్ డిటైలింగ్‌ను కలిగి ఉంటాయి. ఈ బైక్ మాడ్యులర్ డిజైన్ మోటార్‌సైకిల్‌ను క్లాసిక్ సింగిల్-సీటర్ నుంచి డ్యూయల్-సీటర్ బైక్‌గా మార్చేందుకు అనుమతిని ఇస్తుంది..
ఈ కొత్త గ్లోస్ బ్లాక్ ఇంజిన్ కవర్‌లతో ఇంజిన్ బ్లాక్-అవుట్ అయింది. కస్టమ్ ఎగ్జాస్ట్ సిస్టమ్‌తో వచ్చింది. ఈ బైక్ బెస్పోక్ రాయల్ ఎన్‌ఫీల్డ్ జెన్యూన్ మోటార్‌సైకిల్ అప్లియన్సెస్ అయిన బార్ ఎండ్ మిర్రర్స్, ఎల్ఈడీ బ్లాక్ ఇండికేటర్‌లతో ప్రీలోడ్ అయింది.. ఇకపోతే షాట్‌గన్ 650 వెర్షన్ మరో సూపర్ మెటోర్ 650 క్రూయిజర్ నుంచి భిన్నంగా ఉంటుంది. ఇందులోని చాపడ్ ఫెండర్‌లు, హెడ్‌ల్యాంప్ చుట్టూ విభిన్నమైన డిజైన్ ప్లాస్టిక్ కేసింగ్, విభిన్న టర్నింగ్ ఇండికేషన్లు,రీడిజైన్ చేసిన ఎగ్జాస్ట్ మఫ్లర్‌ల వంటి సరికొత్త ఫీచర్లను కూడా ఇందులో అందించడం విశేషం..ఈ బైక్ రెండు చివర్లలో డిస్క్ బ్రేక్‌లతో సూపర్ మోటోర్ మాదిరిగానే ఉంటుంది..ఈ ప్రత్యేక ఎడిషన్ వెర్షన్ జనవరి 2024లో డెలివరీ అయిన వెంటనే సాధారణ మాస్ మార్కెట్ వేరియంట్‌లు లాంచ్ అవుతాయని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. అంతేకాదు.. ఈ బైక్ ఎడిషన్ ధర మరింత పెరగడంతో పాటు మల్టీ వేరియంట్‌లు, కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంటుంది. ఇంకా ఎన్నో అద్భుతమైన ఫీచర్స్ తో మార్కెట్ లోకి రానుంది..