Eluru Crime: ఏలూరు టూటౌన్ పరిధిలో రౌడీ షీటర్లు బరితెగించారు. ఎన్టీఆర్ జిల్లా నుండి స్నేహితురాలు ఇంటికి వచ్చి ఉంటున్న యువతిపై రౌడీ షీటర్లు పులిగడ్డ జగదీష్ బాబు, లావేటి భవాని కుమార్ దాడి చేశారు. స్నేహితురాలి బంధువులు తిరుపతి వెళ్లిన విషయం తెలుసుకొని అర్ధరాత్రి తలుపులు పగలగొట్టి యువతిని లాకెళ్లిన రౌడీషీటర్లలో జగదీష్ బాబు సమీపంలో ఉన్న సచివాలయంకు తీసుకెళ్లి ఆ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు.. ఎవరికైనా చెప్తే చంపేస్తామంటూ బెదిరింపులకి పాల్పడ్డారు. అతనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఇంట్లో ఉన్న యువతిని లాక్కెళ్లి మరీ అత్యాచారం చేసిన ఘటన కలకలం రేపుతోంది.. రౌడీషీటర్లు ఇలా బరి తెగించి.. అమ్మాయిలను ఎత్తుకెళ్లి బలత్కారం చేసిన ఘటనపై విపక్షాలు మండిపడుతున్నాయి..
Read Also: Couple’s Romance in Beach: బీచ్ లోనే రోమాన్స్ చేసిన జంట.. వైరల్ అవుతున్న వీడియో
