అనకాపల్లి మండలంలోని రొంగలివానిపాలెం గ్రామస్థులు పరిషత్ ఎన్నికలను బహిష్కరించారు. గ్రామ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి తొలుత బీసీ వర్గానికి రిజర్వేషన్ కేటాయించి.. ఆ తర్వాత దానిని ఎస్సీ వర్గానికి మార్చడంపై గ్రామస్థులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నిర్ణయాన్ని నిరసిస్తూ ఓటింగ్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు.
రొంగలివానిపాలెం గ్రామంలో ఎస్సీ జనాభా తక్కువగా ఉన్నప్పటికీ.. ఆ వర్గానికి రిజర్వేషన్ కేటాయించడం ఏమిటని గ్రామస్థులు ప్రశ్నిస్తున్నారు. తొలుత ప్రకటించిన రిజర్వేషన్‌ను మార్చడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. పరిషత్ ఎన్నికల ప్రక్రియలో పాల్గొనడం లేదని స్పష్టం చేశారు. గ్రామస్థుల నిర్ణయంతో రొంగలివానిపాలెంలో ఎన్నికల పోలింగ్‌పై ప్రభావం పడింది. పరిస్థితిని చక్కదిద్దేందుకు అధికారులు గ్రామస్థులతో మాట్లాడుతున్నారు. ఎన్నికల బహిష్కరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, ఓటింగ్‌లో పాల్గొనాలని నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే రిజర్వేషన్ల మార్పుపై తమ అభ్యంతరాలను పరిష్కరించాలని గ్రామస్థులు పట్టుబడుతున్నారు.

