NTV Telugu Site icon

Ronald Rose : హైదరాబాద్‌లో పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి..

Ronald Rose

Ronald Rose

పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయని, ఎన్నికలకు ముందు చేయాల్సిన అన్ని పనులు పూర్తి చేశామన్నారు హైదరాబాద్ ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పోస్టల్ బ్యాలెట్ కు చాలా మంచి స్పందన వచ్చిందని, 14,000 మంది పోస్టల్ బ్యాలెట్ ఉపయోగిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. గతంతో పోలిస్తే 6000 మంది అధికంగా ఓటు హక్కు వినియోగించుకున్నారని ఆయన తెలిపారు. ఈరోజు సాయంత్రంతో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ వస్తుందని, హోమ్ ఓటింగ్ కూడా చాలా పర్ఫెక్ట్ గా జరిగిందని ఆయన వెల్లడించారు. పోలింగ్ సిబ్బందికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, పోలింగ్ సిబ్బందిని డిఆర్సీ సెంటర్లకు తీసుకువచ్చేందుకు ప్రత్యేక బస్ లు ఏర్పాటు చేస్తున్నామన్నారు రోనాల్డ్‌ రోస్‌.

 

పోలింగ్ స్టేషన్లో వద్ద ఉన్న క్యూట్ తెలుసుకోవడానికి పోల్ క్యూ ఆప్ చూసుకోవచ్చని, గూగుల్ మ్యాప్ ద్వారా పోలింగ్ స్టేషన్ దారి కనుక్కోవచ్చు అని ఆయన తెలిపారు. వృద్ధులకు వికలాంగులకు పికప్ అండ్ డ్రాప్ అవకాశం కనిపిస్తున్నాము ఇప్పటివరకు 330 మంది దరఖాస్తు చేసుకున్నారన్నారు. ఇంకా కావలసిన వాళ్లు సాక్ష్యం యాప్ లో రిజిస్టర్ చేసుకోవచ్చని ఆయన తెలిపారు. 42 కోట్ల విలువైన వస్తువులు, లిక్కర్,డబ్బులు సీజర్ చేసామని, 3896 పోలింగ్ బూతుల్లో వెబ్ కాస్టింగ్ ఉంటుందన్నారు. బయటి సైడ్ కూడా సీసీ కెమెరాలు ఉంటాయని, మైక్రో అక్సర్వైస్ల కేటాయింపు రేటు జరుగుతుందన్నారు. సి విజిల్ ద్వారా వచ్చిన ఫిర్యాదులను వేగంగా పరిష్కారం చేస్తున్నామని రోనాల్డ్‌ రోస్‌ తెలిపారు.