ఏప్రిల్ 18న నోటిఫికేషన్ జారీ కానున్నట్లు.. ఆరోజు నుండి నామినేషన్లు స్వీకరించబడుతాయని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్ తెలిపారు. 29న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుందని, 13 మే లోక్ సభ ఎన్నికలకు పోలింగ్.. జూన్ 4న కౌంటింగ్ ఉంటుందన్నారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలు లోకి వచ్చిందని ఆయన తెలిపారు. 45,70,138 ఓటర్లు ఉన్నారని, నామినేషన్ చివరి తేదీ వరకు కూడా ఓటర్ నమోదు చేసుకోవడానికి అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ఓటింగ్ శాతం పెంచడానికి ప్రయత్నం చేస్తున్నామని ఆయన తెలిపారు. 85 ఏండ్లు నిండిన వారికి, దివ్యాంగులకు ఇంటి నుండి ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నట్లు వెల్లడించారు రోనాల్డ్ రోస్. బై ఎలక్షన్ కోసం ఈవీఎం లను వేరుగా ఉంచామని, హైదరబాద్ పార్లమెంట్ పరిధిలో 3986 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. పోలింగ్‌లో పాల్గొంటున్న ఉద్యోగుల ఓటర్ ఐడి లను ముందుగానే సేకరిస్తామని, ప్రతి ఉద్యోగి ఓటు వేసేందుకు ఈ ప్రయత్నం చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
సీ విజిల్ ద్వారా ఫిర్యాదు చేస్తే 100 నిమిషాలలో పరిష్కారిస్తామని, సువిదా ద్వారా అనుమతులు ఉంటాయన్నారు. అభ్యర్థులపై ఏమైనా కేసులు ఉంటే పత్రికలలో ప్రచురించాలన్నారు. అనంతరం.. హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. 1690 పోలింగ్ లోకేషన్స్ ఉంటే 4160 పోలింగ్ స్టేషన్లు ఉన్నవని, గన్ లైసెన్స్ ఉన్నవారు వాటిని సరెండర్ చేయాలన్నారు. 3931 గన్ లైసెన్స్ ఉన్నవని, ఇప్పటికే 18 చెక్ పోస్ట్ లను ఏర్పాటు చేసామన్నారు. CAPF 13 కంపెనీలు మనకు రానున్నాయని, నోటిఫికేషన్ రాగానే స్టాటిక్ సర్వైలన్స్ టీం లు పని చేస్తాయన్నారు. 4061 మందిని బైండోవర్ చేసామని, గత ఎన్నికల్లో 36 కోట్ల రూపాయలను సీజ్ చేసామన్నారు.