NTV Telugu Site icon

PSL: పీఎస్ఎల్ ఫ్రాంచైజ్‌లో రోహిత్ శర్మ వాయిస్.. ఫ్యాన్స్ ఫైర్ (వీడియో)

Psl

Psl

పాక్ క్రికెటర్ మహ్మద్ రిజ్వాన్ ఇంగ్లీషును ఎగతాళి చేసినందుకు ఇటీవల ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రాడ్ హాగ్ పై పాకిస్తాన్ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఇప్పుడు మరో వివాదాస్పద వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియో పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL) ఫ్రాంచైజీ ముల్తాన్ సుల్తాన్స్ విడుదల చేయగా.. దీనిపై భారతీయ క్రికెట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. PSL మస్కట్ (తలపాగా), PSL ట్రోఫీతో ముల్తాన్ సుల్తాన్స్ జట్టు నిలబడి ఉన్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే, ఆశ్చర్యకరంగా ఇందులో భారత కెప్టెన్ రోహిత్ శర్మ వాయిస్ బ్యాక్ గ్రౌండ్‌లో వినిపించింది. అందులో రోహిత్ శర్మ.. “ట్రోఫీ గెలవడం అంత సులభం కాదు” అని చెబుతారు.

Read Also: Minister Seethakka: మీ కుటుంబమే రాష్ట్ర పరువు తీసిందని ఫైర్!

ఈ మాటలు 2017లో టీమిండియా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో పాకిస్తాన్ చేతిలో ఓడిపోయిన తర్వాత రోహిత్ శర్మ విలేకరుల సమావేశంలో చేసిన వ్యాఖ్యలే. అయితే.. ముల్తాన్ సుల్తాన్ల వీడియోలో ఈ వ్యాఖ్యను ఉపయోగించడంతో భారత్ ఫ్యాన్స్ తీవ్ర స్థాయిలో ఫైరవుతున్నారు. ఈ వీడియోపై భారతీయ క్రికెట్ అభిమానులు తీవ్రమైన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో కొందరు “ఇది సిగ్గుచేటు చర్య” అని మండిపడ్డారు. మరికొందరు “PSL జట్లు భారత క్రికెటర్లను గౌరవించకపోవడం దురదృష్టకరం” అని వ్యాఖ్యానించారు. ఒక వినియోగదారు తన ట్వీట్‌లో.. “పాకిస్థానీలు బ్రాడ్ హాగ్‌పై ఎలా విరుచుకుపడ్డారో.. ఇప్పుడు మేము కూడా అలాగే స్పందిస్తాం” అని రాశారు. ముల్తాన్ సుల్తాన్స్ చేసిన ఈ చర్య అనేక విమర్శలను ఎదుర్కొంటోంది. ఈ వివాదం PSLకి ముందు మరింత ఆసక్తిని రేకెత్తిస్తుండగా.. ముల్తాన్ సుల్తాన్స్ జట్టు ఈ వీడియోపై ఇంకా అధికారికంగా స్పందించలేదు.

Read Also: Congress: పాకిస్తాన్ అంటే కాంగ్రెస్‌కి చాలా ప్రేమ.. ఇఫ్తార్ విందుకి వెళ్లడంపై బీజేపీ ఫైర్..

PSL 2025 ప్రారంభ తేదీలు
పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL) 10వ సీజన్ ఈ ఏడాది ఏప్రిల్ 11న ప్రారంభంకానుంది. రావల్పిండి క్రికెట్ స్టేడియంలో తొలి మ్యాచ్ డిఫెండింగ్ చాంపియన్స్ ఇస్లామాబాద్ యునైటెడ్-లాహోర్ ఖలందర్స్ మధ్య జరగనుంది. ఈ సీజన్‌లో మొత్తం ఆరు జట్లు పోటీపడతాయి. ఏప్రిల్ 11 నుండి మే 18 వరకు మొత్తం 34 మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. లాహోర్‌లోని గదాఫీ స్టేడియం మొత్తం 13 మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనుంది. ఇందులో ఎలిమినేటర్, ఫైనల్ మ్యాచ్‌లు కూడా ఉంటాయి.