టీమిండియా క్రికెట్ చరిత్రలో ఎవ్వరికీ సాధ్యం కాని అద్భుత రికార్డు రోహిత్ శర్మను ఊరిస్తోంది. ఫిబ్రవరి 9 నుంచి ప్రారంభంకాబోయే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో హిట్‌మ్యాన్ ఓ సెంచరీ చేస్తే, కెప్టెన్‌గా మూడు ఫార్మాట్లలో సెంచరీలు చేసిన తొలి భారత కెప్టెన్‌గా, ఓవరాల్‌గా నాలుగో కెప్టెన్‌గా రికార్డుల్లోకెక్కుతాడు. రోహిత్ తన కెరీర్‌లో ఇప్పటివరకు కెప్టెన్‌గా వన్డే, టీ20ల్లో మాత్రమే సెంచరీలు చేశాడు. టెస్టు జట్టు కెప్టెన్‌గా హిట్‌మ్యాన్ ఖాతాలో ఒక్క సెంచరీ కూడా లేదు. అయితే ఇప్పుడు ఆస్ట్రేలియాతో సిరీస్‌లో భాగంగా జరిగే 4 టెస్టుల్లో హిట్‌మ్యాన్ ఒక్క సెంచరీ చేసినా, దిగ్గజ కెప్టెన్లు గంగూలీ, ధోనీ, కోహ్లీలకు సాధ్యంకాని అత్యంత అరుదైన రికార్డును సొంతం చేసుకుంటాడు. టెస్టుల్లో రోహిత్ 8 సెంచరీలు చేసినప్పటికీ, అవన్నీ ఆటగాడిగా సాధించినవే. కాగా, కెప్టెన్‌గా మూడు ఫార్మాట్లలో సెంచరీలు చేసిన రికార్డు ముగ్గురి పేరిట ఉంది. తొలుత శ్రీలంక మాజీ కెప్టెన్ తిలకరత్నే దిల్షాన్ ఈ ఘనత సాధించగా.. ఆ తర్వాత సౌతాఫ్రికా మాజీ సారథి డుప్లెసిస్, ఇటీవలే పాక్ కెప్టెన్ బాబర్ అజామ్ కెప్టెన్లుగా ఈ ఘనత సాధించారు.
Also Read: Bride Death: హల్దీ చేసుకుని, బాత్‌రూంలో శవమై..వధువు అనుమానాస్పద మృతి
ఇదిలా ఉంటే, నాగ్‌పూర్ వేదికగా ఫిబ్రవరి 9 నుంచి ప్రారంభంకాబోయే తొలి టెస్ట్ కోసం భారత్, ఆస్ట్రేలియా జట్లు కఠోరంగా శ్రమిస్తున్నాయి. గెలుపే లక్ష్యంగా ఇరు జట్లు వ్యూహరచనలో నిమగ్నమై ఉన్నాయి. ఇక ఇరు జట్ల మధ్య గత రికార్డులను ఓసారి పరిశీలిస్తే.. భారత్-ఆసీస్‌లు ఇప్పటివరకు మొత్తం 102 టెస్టు మ్యాచ్‌ల్లో పోటీపడగా 30 మ్యాచ్‌ల్లో టీమిండియా, 43 సందర్భాల్లో ఆసీస్ గెలుపొందాయి. మిగిలిన 29 మ్యాచ్‌ల్లో 28 డ్రా కాగా, ఓ మ్యాచ్ టైగా ముగిసింది. ఇక సిరీస్‌ల విషయానికొస్తే.. ఇరు జట్ల మధ్య 27 సిరీస్‌లు జరగ్గా ఆసీస్ 12, భారత్ 10 సిరీస్‌లు గెలిచాయి. 5 సిరీస్‌లు డ్రాగా ముగిశాయి.
Also Read: INDvsAUS Test: బోర్డర్-గవాస్కర్ సిరీస్ ఆ జట్టుదే.. మాజీ క్రికెటర్ కామెంట్స్