India Schedule: రోహిత్, కోహ్లీ మళ్లీ ఆడేది అప్పుడే.. టీమిండియా నెక్స్ట్ షెడ్యూల్ ఇదిగో..!

India Schedule

India Schedule

India Schedule: భారత క్రికెట్ అభిమానులకు వచ్చే వారం వరుసగా మ్యాచ్‌లు అలరించనున్నాయి. ఇందులో భాగంగా నవంబర్ 19 నుంచి న్యూజిలాండ్‌తో రెండు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుండగా.. మరోవైపు రైజింగ్ స్టార్స్ ఆసియా కప్‌లో భారత్, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. ఈ రెండు టోర్నీల్లోనూ పలువురు స్టార్ ఆటగాళ్లు బరిలోకి దిగనున్నారు. ఇక న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌ను 3-1తో గెలిచిన టీమిండియా సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి కొద్దీ రోజులు విశ్రాంతి లభించనుంది. దీనికి కారణం వారు టెస్టులు, టీ20లకు వీడ్కోలు పలికి ప్రస్తుతం కేవలం వన్డేల్లో మాత్రమే ఆడడం. కాబట్టి భారత్ డిసెంబర్‌లో శ్రీలంకతో మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. డిసెంబర్ 13న తొలి మ్యాచ్ జరగనుండటంతో రోహిత్, కోహ్లీ మళ్లీ అప్పుడే మైదానంలో కనిపించనున్నారు.

భారత్, న్యూజిలాండ్ మధ్య రెండు టెస్టుల సిరీస్ నవంబర్ 19 నుంచి మొదలు కానుంది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ రేసులో నిలవాలంటే ఈ సిరీస్ భారత్‌కు చాలా కీలకం. ప్రస్తుత పాయింట్ల పట్టికలో న్యూజిలాండ్ అగ్రస్థానంలో ఉండగా.. భారత్ నాలుగో స్థానంలో ఉంది. టాప్-3లోకి వెళ్లాలంటే ఈ సిరీస్‌ను 2-0తో తప్పక గలవాల్సిందే. ఈ సిరీస్ కోసం శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్, అంషుల్ కాంబోజ్ చివరి రెండు వన్డేలకు దూరంగా ఉంచి జట్టు మేనేజ్మెంట్. మరోవైపు గాయం నుంచి కోలుకున్న రిషబ్ పంత్ కూడా టెస్టు జట్టుతో చేరాడు.

వచ్చే వారంలోనే రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ 2026 కూడా మొదలు కానుంది. ఇందులో భారత్ తన తొలి మ్యాచ్‌ను నవంబర్ 20న నేపాల్‌తో ఆడనుంది. ఈ టోర్నీలో ఇండియా A జట్టుకు తిలక్ వర్మ కెప్టెన్‌గా ఉండగా.. వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, రింకూ సింగ్, ప్రభ్‌సిమ్రన్ సింగ్, హర్షిత్ రాణా వంటి స్టార్ ఆటగాళ్లు కూడా బరిలోకి దిగనున్నారు. ఇక ఈ సిరీస్ లో క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్, పాకిస్థాన్ మ్యాచ్ నవంబర్ 22న జరగనుంది. ఈ మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీతో పాటు అభిషేక్ శర్మ వంటి ఆటగాళ్ల ప్రదర్శనపై అందరి దృష్టి ఉండనుంది.

ఇండియా ఏ జట్టు మ్యాచ్‌ల షెడ్యూల్

– నవంబర్ 20: భారత్ ఏ vs నేపాల్.
– నవంబర్ 22: భారత్ ఏ vs పాకిస్థాన్.
– నవంబర్ 24: భారత్ ఏ vs యూఏఈ.