Site icon NTV Telugu

Rohit Sharma: ఇది ఆరంభం మాత్రమే.. రోహిత్‌ శర్మ ట్వీట్‌ వైరల్!

Rohit Sharma

Rohit Sharma

Rohit Sharma on Mumbai Indians Win vs Delhi Capitals: ఐపీఎల్‌ 2024లో ముంబై ఇండియన్స్‌ తొలి విజయాన్ని అందుకుంది. హ్యాట్రిక్ ఓటముల తరవాత.. అద్భుత విజయం సాదించింది. ఆదివారం హోం గ్రౌండ్‌ వాంఖడేలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 29 పరుగుల తేడాతో గెలిచింది. ఈ విజయంపై ముంబై మాజీ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ స్పందించాడు. ‘ఇది ఆరంభం మాత్రమే.. ముందుది అసలు పండగ’ అని అర్ధం వచ్చేలా ‘ఆఫ్‌ది మార్క్‌’ అని ఎక్స్‌లో ట్వీట్‌ చేశాడు. రేసుల స్టార్టింగ్‌లో ఊపే ‘చెకర్డ్‌ ఫ్లాగ్‌’ ఎమోజీని రోహిత్ యాడ్‌ చేశాడు. ఈ పోస్టుకు మూడు ఫొటోలను కూడా షేర్‌ చేశాడు. ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్‌గా మారింది.

హిట్‌మ్యాన్‌ రోహిత్‌ శర్మ ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓ అరుదైన రికార్డు అందుకొన్నాడు. ఐపీఎల్‌లో 100 క్యాచ్‌లు పట్టిన ఆటగాడిగా నిలిచాడు. వాంఖడే మైదానంలో ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో గెరాల్డ్ కొయెట్జీ ఓవర్‌లో జే రిచర్డ్‌సన్ క్యాచ్ అందుకోవడంతో 100వ క్యాచ్‌ పూర్తయింది. దాంతో సురేష్ రైనా, విరాట్ కోహ్లీ, కీరన్ పోలార్డ్‌ తర్వాత 100 క్యాచ్‌ల మైలురాయిని చేరుకొన్న నాలుగో ఆటగాడిగా హిట్‌మ్యాన్‌ నిలిచాడు. అంతర్జాతీయ కెరీర్‌లో టెస్టుల్లో 60, వన్డేల్లో 93, టీ20ల్లో 60 క్యాచ్‌లు అందుకొన్నాడు.

Also Read: Dasara Movie: దసరా సినిమాలో నాని ఫ్రెండ్ క్యారెక్టర్‌ నేను చేయాల్సింది: మ్యూజిక్ డైరెక్టర్

ఈ మ్యాచ్‌లో ముంబై 20 ఓవర్లలో 5 వికెట్లకు 234 పరుగులు చేసింది. రోహిత్‌ శర్మ (49; 27 బంతుల్లో 6×4, 3×6), ఇషాన్‌ కిషన్‌ (42; 23 బంతుల్లో 4×4, 2×6), టిమ్‌ డేవిడ్‌ (45 నాటౌట్‌; 21 బంతుల్లో 2×4, 4×6), రొమారియో షెఫర్డ్‌ (39 నాటౌట్‌; 10 బంతుల్లో 3×4, 4×6) రాణించారు. ఢిల్లీ బౌలర్ అక్షర్‌ పటేల్‌ (2/35) రెండు వికెట్స్ పడగొట్టాడు. ఛేదనలో ఢిల్లీ 20 ఓవర్లలో 8 వికెట్లకు 205 పరుగులు చేసింది. ట్రిస్టన్‌ స్టబ్స్‌ (71 నాటౌట్‌; 25 బంతుల్లో 3×4, 7×6), పృథ్వీ షా (66; 40 బంతుల్లో 8×4, 3×6) పోరాటం వృధా అయింది. కొయెట్జీ (4/34), బుమ్రా (2/22) రాణించారు.

Exit mobile version