Site icon NTV Telugu

Rohit Sharma Test Retirement: అభిమానులకు భారీ షాక్.. రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ శర్మ!

Rohit Sharma Test Retirement

Rohit Sharma Test Retirement

టీమిండియా అభిమానులకు భారీ షాక్. ‘హిట్‌మ్యాన్’ రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా ఈ విషయాన్ని ప్రకటించాడు. ఇప్పటికే రోహిత్‌ అంతర్జాతీయ టీ20కి రిటైర్మెంట్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా టెస్టులకు గుడ్‌బై చెప్పాడు. టీ20, టెస్టు ఫార్మాట్లకు దూరమైనా.. వన్డేల్లో హిట్‌మ్యాన్ కొనసాగనున్నాడు. 2027 వన్డే ప్రపంచకప్‌ వరకు రోహిత్ ఆడే అవకాశాలు ఉన్నాయి. వన్డే ప్రపంచకప్‌ గెలవడం తన కల అని ఎన్నోసార్లు చెప్పిన విషయం తెలిసిందే.

38 ఏళ్ల రోహిత్ శర్మ టెస్ట్ కెరీర్‌లో మొత్తం 67 మ్యాచ్‌లు ఆడి 40.57 సగటుతో 4301 పరుగులు చేశాడు. ఇందులో 12 శతకాలు, 18 అర్ధ శతకాలు ఉన్నాయి. కెప్టెన్‌గా 24 టెస్టుల్లో భారత జట్టుకు నాయకత్వం వహించి.. 12 విజయాలు సాధించాడు. జూన్ 2025లో జరగనున్న ఇంగ్లాండ్ పర్యటనకు భారత జట్టు ఎంపికకు ముందు రోహిత్ ఈ కీలక నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఈ ఏడాది ఆరంభంలో బోర్డర్అ-గవాస్కర్ 2025లో రోహిత్ నిరాశపరిచాడు. పేలవ ఫామ్ కారణంగా చివరి టెస్టు నుంచి స్వయంగా తప్పుకున్నాడు. టెస్టుల్లో ఇటీవల ఫామ్ లోపం కారణంగానే హిట్‌మ్యాన్ ఈ నిర్ణయం తీసుకున్నాడని అందరూ భావిస్తున్నారు.

Exit mobile version