Site icon NTV Telugu

Rohit Sharma: ఇదే నా చివరి సీజన్.. అది నా ఇల్లు బ్రదర్‌..!

Rohit Sharma

Rohit Sharma

Hardik Pandya VS Rohit Sharma: ఐపీఎల్‌ 2024 కంటే ముందే సారథ్య బాధ్యతల నుంచి రోహిత్‌ శర్మను తప్పించిన ముంబై ఇండియన్స్ యాజమాన్యం.. గుజరాత్‌ టైటాన్స్‌ నుంచి ట్రేడ్‌ చేసుకున్న హార్దిక్‌ పాండ్యాకు జట్టు పగ్గాలు అప్పగించింది. అయితే, పాండ్యా కెప్టెన్సీలో ముంబై టీమ్ పేలవ ప్రదర్శనతో చతికిల పడింది. ఈ సీజన్‌లో ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా పెద్ద అపఖ్యాతిని ఎంఐ జట్టు మూటగట్టుకుంది. రోహిత్‌, హార్దిక్‌లకు మద్దతుగా జట్టు రెండు‌ వర్గాలుగా విడిపోవడంతోనే ఈ వైఫల్యాలు ఎదురయ్యాయనే అభిప్రాయాలు వస్తున్నాయి.

Read Also: Uttarpradesh : మేనకోడలి మరణాన్ని తట్టుకోలేక గుండెపోటుతో చనిపోయిన అత్త

అయితే, హార్థిక్ పాండ్యా వ్యవహార శైలి పట్ల కోపంగా ఉన్న రోహిత్‌ శర్మ వచ్చే ఏడాది ముంబై జట్టును వదిలి పెట్టే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. ముంబై ఇండియన్స్ ఇవాళ కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ టీమ్ తో తలపడబోతుంది. ఈ సందర్భంగా మ్యాచ్‌ సన్నాహకాల్లో భాగంగా గ్రౌండ్ లోకి వెళ్లిన రోహిత్‌- కేకేఆర్‌ కోచ్‌ అభిషేక్‌ నాయర్‌తో మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Read Also: MP Dharmapuri Arvind: ఎంపీ అరవింద్ పై కేసు నమోదు..

ఈ వీడియోలో రోహిత్ శర్మ మాట్లాడుతూ.. జట్టులో ఒక దాని తర్వాత మరొకటి మారిపోతున్నాయి.. వాళ్లే ఇందుకు కారణం.. ఏదేమైనా గానీ.. అది నా ఇల్లు బ్రదర్‌.. నేను నిర్మించిన గుడి.. కానీ, ఇదే నాకు లాస్ట్‌ అంటూ రోహిత్‌ వ్యాఖ్యానించినట్లుగా సమాచారం. దీనిని బట్టి రోహిత్‌ శర్మ ముంబై ఫ్రాంఛైజీకి గుడ్‌బై చెప్పడం ఖాయమైనట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే.. రోహిత్‌ శర్మ నెక్ట్స్ కేకేఆర్‌ జట్టులోకి చేరితే బాగుంటుందంటూ పాకిస్తాన్‌ లెజెండరీ పేసర్‌ వసీం అక్రం పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అభిషేక్‌ నాయర్‌తో హిట్‌మ్యాన్‌ రోహిత్ శర్మ మాట్లాడిన వీడియో నెట్టంట తెగ వైరల్ అవుతుంది.

Exit mobile version