Site icon NTV Telugu

Rohit Sharma: మైదానంలోకి ఎంట్రీ ఇస్తున్న హిట్‌మ్యాన్.. ఏ టోర్నీ కోసమే తెలుసా!

Rohit Sharma

Rohit Sharma

Rohit Sharma: క్రికెట్ ప్రేమికులు రోహిట్ శర్మను ముద్దగా పిలుచుకునే పేరు హిట్‌మ్యాన్. రోహిత్ మైదానంలోకి దిగి దుమ్ము రేపుతుంటే చూడటానికి అభిమనులకు రెండు కళ్లు సరిపోవంటే అతిశయోక్తి కాదు. మళ్లీ హిట్‌మ్యాన్ మైదానంలోకి ఎప్పుడు దిగుతాడా అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వాళ్ల నిరీక్షణకు తెరదించుతూ రోహిత్ శర్మ మళ్లీ మైదానంలోకి అడుగు పెట్టబోతున్నాడు. ఇంతకీ ఏ టోర్నీ కోసం రోహిత్ శర్మ మైదానంలోకి దిగుతున్నాడో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

READ ALSO: Bhimavaram Krishna Statue Issue: భీమవరంలో సూపర్ స్టార్ కృష్ణ విగ్రహం చుట్టూ వివాదం..

ఇటీవల బీసీసీఐ టీమిండియా తరుఫున బరిలోకి దిగుతున్న క్రికెటర్లను అందరిని కూడా కచ్చితంగా విజయ్ హజారే ట్రోఫీ ఆడాల్సిందే అని స్పష్టంగా చెప్పిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో డిసెంబర్ 24 నుంచి ప్రారంభం కానున్న విజయ్ హజారే ట్రోఫీలో దిగ్గజ క్రికెటర్ రోహిత్ శర్మ పాల్గొనబోతున్నాడు. ఈ టోర్నీలో హిట్‌మ్యాన్ ముంబయి తరపున రెండు మ్యాచుల్లో ఆడనున్నట్లు సమాచారం. పలు మ్యాచులకు సూర్యకుమార్ యాదవ్, యశస్వి జైస్వాల్, అంజిక రహానే దూరంగా ఉంటున్నారు.

ఈ సందర్భంగా ముంబయి చీఫ్ సెలక్టర్ సంజయ్‌పాటిల్ మీడియాతో మాట్లాడుతూ.. ‘మొదటి రెండు మ్యాచులకు జైస్వాల్, దూబె, రహానే ముంబయి జట్టులో ఉండరు. ఈక్రమంలో సెలక్షన్ ప్యానల్ యువ క్రికెటర్లకు అవకాశం ఇవ్వనుంది. యశస్వి జైస్వాల్ ఉదర సంబంధ సమస్యతో బాధ పడుతున్నాడు. ప్రస్తుతం అతడు చికిత్స తీసుకుంటున్నాడు’ అని అన్నారు. ఈ టోర్నీలో ముంబయి జట్టు గ్రూప్ సిలో ఉంది. ముంబయితో పాటు పంజాబ్, ఉత్తరాఖండ్, సిక్కిం, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, గోవా, హిమాచల్‌ప్రదేశ్ కూడా ఇదే గ్రూపులో ఉన్నాయి. ఢిల్లీ జట్టుకు టీమ్ ఇండియా టెస్ట్ టీమ్ వైస్‌కెప్టెన్ రిషబ్ పంత్ నాయకత్వం వహించనున్నారు. అలాగే ఢిల్లీ జట్టు తరుఫున విరాట్ కోహ్లి విజయ్ హజారే ట్రోఫీలో పాల్గొననున్నట్లు సమాచారం.

అహ్మదాబాద్, రాజ్కోట్, జైపుర్ వేదికగా ఈ మ్యాచ్లు డిసెంబర్ 24 నుంచి జనవరి 8 వరకు జరగనున్నాయి. జనవరి 12 నుంచి జనవరి 18 వరకు సెంట్రల్ ఆఫ్ ఎక్సలెన్స్ బెంగళూరు మైదానంలో నాకౌట్ మ్యాచులను నిర్వహించనున్నారు. డిసెంబర్ 24న ముంబయి తన ఫస్ట్ మ్యాచ్‌లో సిక్కింతో తలపడనుంది.

READ ALSO: Andhra King Thaluka OTT Release: ఓటీటీలోకి ‘ఆంధ్ర కింగ్ తాలూకా’… స్ట్రీమింగ్ ఏ రోజున అంటే!

Exit mobile version