NTV Telugu Site icon

Rohit Sharma: ఆ.. భారీ రికార్డుపై కన్నేసిన రోహిత్ శర్మ

Rohith Sharma

Rohith Sharma

ఆరంభంలో తడబడ్డా.. ఆపై పుంజుకున్నాడు. జట్టు విజయమే లక్ష్యంగా ఎన్నో రికార్డుల్ని చేజార్చుకున్నాడు. తన కెప్టెన్సీలో ముంబై ఇండియన్స్ ని ఐదు సార్లు ఛాంపియన్ గా నిలబెట్టాడు. కెప్టెన్సీ కోల్పోయినప్పటికీ బాధపడలేదు. తన జట్టును గెలిపించడానికి ఎంత కష్టాన్నైనా భరించాడు. విమర్శకులు ఎన్ని కామెంట్స్ చేసినా పట్టించుకోలేదు. కోట్లు పెట్టి కొనుకున్న యాజమాన్యానికి ఏ నాడు భారం కాలేదు. ఫ్యాన్స్ అతన్ని హిట్ మ్యాన్ అని ముద్దుగా పిలుచుకుంటారు. పేరుకు తగ్గట్టే భారీ హిట్టింగ్ తో బౌలర్ల పాలిట యముడిలా మారిపోతాడు.

Also Read:DGP Jitender: తెలంగాణలో 230 మంది పాకిస్తానీయులు.. ఈ నెల 30లోపు వెళ్లిపోవాల్సిందే..!

విజయం అంచున ఉన్నప్పుడు ఏ మాత్రం కనికరం చూపడు. జట్టు విజయమే లక్ష్యంగా ఊచకోత కోస్తాడు. ఈ సీజన్ ఆరంభ మ్యాచుల్లో వరుస ఓటములతో నిరాశపరిచిన ముంబై జట్టుని హిట్ ట్రాక్ ఎక్కించాడు. గత రెండు మ్యాచుల్లో రోహిత్ విధ్వంసం మరోసారి ప్రపంచానికి పరిచయం చేశాడు. చెన్నై సూపర్ కింగ్స్ పై ఫామ్ లోకి వచ్చిన రోహిత్ శర్మ 76 పరుగులతో పెను విధ్వంసం సృష్టించాడు. భారీ షాట్లతో సీఎస్ కే బౌలర్లకు చమటలు పట్టించాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ పై 70 పరుగులు చేసి తన బ్యాటింగ్ పవర్ ని రుచి చూపించాడు. ఈ రెండు మ్యాచుల్లో ముంబై ఇండియన్స్ విజయానికి రోహిత్ పవర్ హిట్టింగే కారణం.

Also Read:DGP Jitender: తెలంగాణలో 230 మంది పాకిస్తానీయులు.. ఈ నెల 30లోపు వెళ్లిపోవాల్సిందే..!

అయితే రోహిత్ గతంలో ఇలాంటి భారీ ఇన్నింగ్స్ లు ఎన్నో ఆడాడు. ఐపీఎల్ లో రోహిత్ రెండో అతిపెద్ద స్కోరర్ గా కొనసాగుతున్నాడు. ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ 261 మ్యాచ్‌ల్లో మొత్తం 8396 పరుగులు చేశాడు. రోహిత్ శర్మ 265 మ్యాచ్‌ల్లో 6856 పరుగులు చేశాడు. అయితే రోహిత్ 7 వేల పరుగుల మార్క్ ను చేరుకోవడానికి 144 పరుగుల దూరంలో ఉన్నాడు. ఈ సీజన్లో ముంబై కనీసం ఐదు మ్యాచులు ఆడాలి.

Also Read:V. Srinivas Goud: కష్టపడి తెచ్చుకున్న తెలంగాణను కాంగ్రెస్ ఆగం చేస్తుంటే బాధ కలుగుతుంది..

సో రోహిత్ ఈ సీజన్లోనే 7 వేల పరుగుల క్లబ్ లో చేరడం ఖాయం. ముంబై ఇండియన్స్ తమ తదుపరి మ్యాచ్‌ లక్నో సూపర్ జెయింట్స్‌తో రేపు మధ్యాహ్నం తలపడనుంది. ముంబైలోని వాంఖడే స్టేడియం దీనికి ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్‌లో అందరి చూపు రోహిత్ పైనే. లక్నోపై రోహిత్ విధ్వంసం కొనసాగాలని ముంబై ఫ్యాన్స్ ఆశపడుతున్నారు. కాగా ముంబై 9 మ్యాచ్‌ల్లో 5 విజయాలు, 4 ఓటములతో 10 పాయింట్లతో నాలుగవ స్థానంలో కొనసాగుతుంది.