Rohit Sharma Injury Update: ముంబై ఇండియన్స్‌కు కీలకమైన సమయంలో కెప్టెన్ హార్దిక్ పాండ్య, స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ ఫిట్‌నెస్‌పై కీలక అప్డేట్ ఇచ్చాడు. ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ టాస్ సందర్భంగా మాట్లాడిన హార్దిక్.. రోహిత్ ఇంకా పూర్తిగా కోలుకోలేదని, జట్టులోకి రావడానికి మరో 2-3 మ్యాచ్‌లు పడుతుందని చెప్పుకొచ్చాడు. “రోహిత్ ఇంకా పూర్తిగా ఫిట్‌గా లేడు. అతను ప్రయత్నిస్తున్నాడు కానీ తనకు కావాల్సిన స్థాయిలో ఫిట్‌నెస్ లేదని వివరించాడు. అందుకే రోహిత్ ఈ మ్యాచ్‌కు అందుబాటులో లేడు” అని హార్దిక్ పాండ్యా తెలిపాడు. దీంతో రోహిత్ శర్మ గైర్హాజరు ముంబై ఇండియన్స్‌కు మరో పెద్ద దెబ్బగా మారింది.
ఏప్రిల్ 12న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ హ్యామ్ స్ట్రింగ్ గాయానికి గురయ్యాడు. బ్యాటింగ్ చేస్తూ నొప్పితో బాధపడిన రోహిత్, రిటైర్డ్ హర్ట్‌గా వెళ్లి.. మళ్లీ ఆ ఇన్నింగ్స్‌లో తిరిగి బ్యాటింగ్‌కు రాలేకపోయాడు. ఆ తర్వాత నుంచి వరుసగా మూడు మ్యాచ్ లకు కూడా దూరమయ్యాడు. రోహిత్ లేకపోవడం ముంబై ఇండియన్స్ ప్రదర్శనపై ప్రభావం కనపడుతుంది. ఇప్పటికే జట్టు పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో ఉండగా, రోహిత్ గైర్హాజరు పరిస్థితిని మరింత క్లిష్టం చేసింది.
హార్దిక్ పాండ్యా ఇచ్చిన సమాచారం ప్రకారం.. రోహిత్ శర్మ ఇంకా 2-3 మ్యాచ్‌లకు దూరంగా ఉండే అవకాశం ఉంది. దీంతో మే 2న చెన్నై సూపర్ కింగ్స్ తో చెపాక్‌లో జరిగే కీలక మ్యాచ్‌ను కూడా అతను మిస్ అయ్యే అవకాశం ఉంది. అలాగే మే 4న లక్నో సూపర్ జెయింట్స్ పై జరిగే మ్యాచ్‌లో కూడా రోహిత్ ఆడే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి.
🚨 TOSS 🚨@mumbaiindians won the toss & chose to bat first against @SunRisers in Wankhede!
Updates ▶️ https://t.co/ypWTkEr2Rc#TATAIPL | #KhelBindaas | #MIvSRH pic.twitter.com/5JNhDPJD96
— IndianPremierLeague (@IPL) April 29, 2026
