NTV Telugu Site icon

Rohit Sharma: ఏంటి రోహిత్.. అంత కోపమెందుకు?

Rohit

Rohit

Rohit Sharma: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అన్ని టీమ్స్ లో కొత్త ఆటగాళ్ల రాకతో ఈ సీజన్ మరింత ఆసక్తికరంగా ఉండనుంది. టోర్నమెంట్ మొదటి రెండు రోజుల్లోనే రసవత్తరమైన మ్యాచ్‌లు ఉండబోతుండటంతో క్రికెట్ లవర్స్ ఇంకా ఉత్సాహంగా ఉన్నారు. మార్చి 22న ఐపీఎల్ 2025 గ్రాండ్ ఓపెనింగ్‌ మ్యాచ్‌ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) మధ్య జరగనుంది. మరుసటి రోజు ఐపీఎల్ లో బలమైన జట్లుగా పేరు సాధించిన రెండు జట్లు చెన్నై సూపర్ కింగ్స్ (CSK), ముంబై ఇండియన్స్ (MI) మధ్య హై-వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది.

Read Also: SBI Yono App: SBI వినియోగదారులకు అలర్ట్.. ఈ యాప్ పని చేయదు..!

నిజానికి చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య పోటీ ఎప్పుడూ ప్రత్యేకంగా ఉంటుందనే చెప్పవచ్చు. ఈ రెండు జట్లు ఐపీఎల్‌లో చెరో 5 సార్లు టైటిల్ గెలుచుకున్నాయి. అందుకే, వీటి మధ్య జరిగే మ్యాచ్‌కు అపారమైన క్రేజ్ ఉంటుంది కాబోలు. ఐపీఎల్ 2025లో ఈ రెండు జట్ల మధ్య మొదటి మ్యాచ్ మార్చి 23న చెపాక్ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్‌కు ముందు ఐపీఎల్ రూపొందించిన ప్రోమో వీడియోలో రోహిత్ శర్మ ప్రస్ట్రేషన్ చూపిస్తూ, ముంబై-చెన్నై పోటీపై అభిమానుల్లో మరింత ఉత్సాహం పెంచాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది.

Read Also: Nitish Kumar Reddy: ‘కాటేరమ్మ కొడుకు’గా మారిన నితీశ్ కుమార్ రెడ్డి.. బ్యాట్లనే కత్తులుగా!

ఈ ప్రోమో వీడియోలో ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ, ప్రస్తుత కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఒక రెస్టారెంట్‌లో కూర్చొని మాట్లాడుతున్నారు. మన మొదటి మ్యాచ్ ఎప్పుడు? అని రోహిత్ అడిగాడు. ఆ తర్వాత ముందుగా పక్కనే ఉన్న ఒక వెయిటర్‌ను పిలిచిన తర్వాత, మ్యాచ్ ఆదివారం, CSK తో అని సమాధానం ఇస్తాడు అంతే. CSK పేరు విన్న వెంటనే రోహిత్ కోపంతో రగిలిపోతూ, టేబుల్ మీద ఉన్న జ్యూస్ గ్లాస్‌ను తన చేత్తో పగలగొట్టాడు. ఇది చూసిన హార్దిక్ నవ్వుతూ, వెయిటర్‌ను శుభ్రం చేయమని చెబుతాడు. ఈ ప్రోమో వైరల్ కావడంతో క్రికెట్ అభిమానుల్లో ఉత్కంఠ మరింత పెరిగింది. గతంలో ముంబై కెప్టెన్‌గా ఐదుసార్లు ఐపీఎల్ ట్రోఫీ గెలిపించిన రోహిత్ శర్మ, ఈసారి కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్యా నేతృత్వంలో ఎలా ఆడతాడో చూడాలి. ఇంకెందుకు ఆలశ్యం ఈ వైరల్ వీడియోను మీరు కూడా చూసేయండి.