NTV Telugu Site icon

Rohit Sharma: నెదర్లాండ్స్‌తో మ్యాచ్.. రోహిత్ శర్మ ముందు మూడు రికార్డులు!

Rohit

Rohit

Rohit Sharma Eye on AB de Villiers Sixes Record: వన్డే ప్రపంచకప్ 2023లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అదరగొడుతున్నాడు. తనకు అచ్చొచ్చిన మెగా టోర్నీలో మరోసారి పరుగుల వరద పారిస్తున్నాడు. ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడుతున్న రోహిత్.. టీమిండియాకు అద్భుత విజయాలు అందిస్తున్నాడు. ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్‌లలో 442 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ కూడా ఉంది. వన్డే ప్రపంచకప్ 2023లో భారత్ తన చివరి మ్యాచ్‌ను ఆదివారం నెదర్లాండ్స్‌తో ఆడనుంది. ఈ మ్యాచ్‌కు ముందు హిట్‌మ్యాన్‌ను మూడు రికార్డులు ఊరిస్తున్నాయి.

నెదర్లాండ్స్ మ్యాచ్‌కు ముందు రోహిత్ శర్మను రెండు సిక్సర్ల రికార్డులు ఊరిస్తున్నాయి. ప్రపంచకప్ 2023 ముందు వరకు ఒక క్యాలెండర్ ఇయర్‌లో వన్డేల్లో అత్యధిక సిక్సర్లు బాదిన ప్లేయర్‌గా దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు, మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్ ఉన్నాడు. 2015లో వన్డేల్లో ఏబీ 58 సిక్సర్లు బాదాడు. రోహిత్ ఈ ఏడాది ఇప్పటివరకు వన్డేల్లో 58 సిక్సర్లు బాది డివిలియర్స్ రికార్డును సమం చేశాడు. మరో సిక్సర్ బాదితే.. వన్డే చరిత్రలో ఒక ఏడాది అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా రోహిత్ నిలుస్తాడు.

Also Read: Iceland Earthquakes: 14 గంటల వ్యవధిలో 800 భూప్రకంపనలు.. అత్యవసర పరిస్థితి ప్రకటించిన ఐస్‌లాండ్‌!

మరో ఐదు సిక్సర్లు బాదితే ప్రపంచకప్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ రికార్డు బద్దలు రోహిత్ శర్మ కొడతాడు. వన్డే ప్రపంచకప్‌ చరిత్రలో అత్యధిక సిక్సులు బాదిన జాబితాలో 49 సిక్సర్లతో గేల్ అగ్ర స్థానంలో ఉన్నాడు. 45 సిక్సర్లతో రోహిత్ రెండో స్థానంలో ఉన్నాడు. ప్రస్తుత రోహిత్ జోరు చూస్తుంటే ఈ రికార్డును నెదర్లాండ్స్‌పైనే తన ఖాతాలో వేసుకోనున్నాడు.

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ప్రపంచకప్ టోర్నీలలో 25 మ్యాచులాడి 1420 పరుగులు చేశాడు. మరో 80 పరుగులు చేస్తే.. 1500 పరుగుల క్లబ్‌లోకి ఎంటర్ అవుతాడు. ఈ ఘనత సాధించిన ఐదో బ్యాటర్‌గా రోహిత్ రికార్డు నెలకొలుపుతాడు. ఈ జాబితాలో రోహిత్ కన్నా ముందు సచిన్ టెండూల్కర్, రికీ పాంటింగ్, కుమార సంగక్కర, విరాట్ కోహ్లీ ఉన్నారు.

 

Show comments