Site icon NTV Telugu

Rohit Sharma: ఫాన్స్‌కు రోహిత్ శర్మ భావోద్వేగ పోస్ట్..

Rohit Sharma

Rohit Sharma

Rohit Sharma: భారత్ – ఆస్ట్రేలియా మధ్య ఎన్నో అంచనాల మధ్య ప్రారంభమైన మూడు వన్డేల సిరీస్ ముగిసింది. ఈ సిరీస్‌లో రోహిత్ శర్మ- విరాట్ కోహ్లీ జంట ప్రత్యేక ఆకర్షణగా నిలిచారనే విషయం తెలిసిందే. ఏడు నెలల సుదీర్ఘ విరామం తర్వాత రోకో జోడి మైదానంలో కనిపించింది ఈ సిరీస్‌లోనే. మాజీ కెప్టెన్, టీమిండియా దిగ్గజ ఆటగాడు రోహిత్ శర్మ ఒక అర్ధ సెంచరీ, అజేయ సెంచరీతో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా ఎంపికయ్యాడు. మూడు మ్యాచ్‌లలో భారత్ కేవలం ఒక మ్యాచ్‌లో మాత్రమే గెలిచినప్పటికీ, రోహిత్ – విరాట్ ఆడిన విధానం 2027 ప్రపంచ కప్ కోసం వారి ఆశలను సజీవంగా ఉంచిందని విశ్లేషకులు చెబుతున్నారు.

READ ALSO: Viral Video: మందు ఇలా కూడా తాగొచ్చా.. ఇదిఎలా సాధ్యం గురూ..!

చివరిసారిగా సిడ్నీ..
ఈ సిరీస్ తర్వాత రోహిత్ శర్మ స్వదేశానికి తిరిగి వచ్చాడు. స్వదేశానికి తిరిగి వచ్చే ముందు ఆయన తన ఎక్స్ ఖాతా నుంచి ఒక భావోద్వేగ పోస్ట్‌ను పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్‌లో ఆయన “చివరిసారిగా సిడ్నీకి వీడ్కోలు” అనే వ్యాఖ్యలను జత చేశారు. భారతదేశం – ఆస్ట్రేలియా మధ్య జరిగిన మూడవ వన్డే సిడ్నీలో జరిగింది. ఇక్కడ రోహిత్ అజేయ సెంచరీ సాధించి టీమిండియాకు గొప్ప విజయాన్ని అందించాడు. ఈ సిరీస్ ద్వారా రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్‌లో 50 సెంచరీలు సాధించాడు. రోహిత్ ఇప్పటి వరకు టెస్టుల్లో 12, ​​వన్డేల్లో 33, టీ20ల్లో 5 సెంచరీలు చేశాడు. ఆయన అన్ని ఫార్మెట్స్ కలిపి మొత్తం 50 సెంచరీలు చేశాడు.

ఆస్ట్రేలియాలో విదేశీ బ్యాట్స్‌మెన్ చేసిన అత్యధిక వన్డే సెంచరీలు:

1. రోహిత్ శర్మ – 6 సెంచరీలు (33 ఇన్నింగ్స్)
2. విరాట్ కోహ్లీ – 5 సెంచరీలు (32 ఇన్నింగ్స్)
3. కుమార్ సంగక్కర – 5 సెంచరీలు (49 ఇన్నింగ్స్)

ఒకే ప్రత్యర్థిపై అత్యధిక వన్డే సెంచరీలు చేసిన క్రీడాకారులు..

1. విరాట్ కోహ్లీ – శ్రీలంకపై 10
2. విరాట్ కోహ్లీ – వెస్టిండీస్‌పై 9
3. సచిన్ టెండూల్కర్ – ఆస్ట్రేలియాపై 9
4. రోహిత్ శర్మ – ఆస్ట్రేలియాపై 9

READ ALSO: Bihar Elections 2025: అధికారంలోకి వస్తే వక్ఫ్ చట్టాన్ని చెత్తబుట్టలో పడేస్తాం: తేజస్వి యాదవ్

Exit mobile version