Site icon NTV Telugu

Rohit Sharma : అతని వల్లే మేము మ్యాచ్ ఓడిపోయాం..

Rohit Sharma

Rohit Sharma

Rohit Sharma : ఐపీఎల్ 2023లో వరుసగా మూడు విజయాలు నమోదు చేసి మంచి జోష్ మీద కనిపించిన ముంబై ఇండియన్స్ జట్టుకు పంజాబ్ కింగ్స్ టీమ్ నుంచి ఊహించని షాక్ తగిలింది. ఈ మెగా ఈవెంట్ లో భాగంగా వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ ను 13 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్ ఓడించింది. 215 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగదిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 201 పరుగులు మాత్రమే చేసింది. ఇక ఓటమిపై మ్యాచ అనంతరం ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించారు. చివరి ఓవర్ లో అర్షదీప్ సింగ్ అద్భుతమైన బౌలింగ్ చేశాడని రోహిత్ పేర్కొన్నాడు.

Also Read : Balineni Srinivasa Reddy : అందులో పెట్టుబడులు నేను పెట్టలేదు.. నిరూపిస్తే నా ఆస్తి రాసిస్తా

డెత్ ఓవర్లలో మా బౌలర్ల విఫలమయ్యారు. భారీగా పరుగులు సమర్పించుకున్నారు. అది అస్సలు నేను ఊహించలేదు.. అదే విధంగా ఫీల్డింగ్ కూడా కొన్ని తప్పిదాలు చేశామని ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ అన్నారు. అయితే మేము ఆఖరివరకు అద్భుతంగా పోరాడాం.. కాబట్టి ఈ ఓటమిని మరీ సీరియస్ గా తీసుకొని దిగులు చెందాల్సిన అవసరములేదు.. ఇప్పటి వరకు మేము ఆరు మ్యాచ్ ల్లో మూడింట విజయం సాధించాము.. ఈ టోర్నీలో ఇంకా చాలా మ్యాచ్ లు మిగిలి ఉన్నాయని రోహిత్ అన్నాడు. కాబట్టి ఎదైనా జరుగవచ్చు. అయితే ఈ మ్యాచ్ లో కొన్ని పొరపాట్లు చేశాం.. మా నెక్స్ట్ మ్యాచ్ లో వాటిని సరిదిద్దుకుంటాం అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.

Also Read : Rains : ఉమ్మడి వరంగల్ జిల్లాలో వర్ష బీభత్సం

ఇక సూర్యకుమార్ యాదవ్, కామెరూన్ గ్రీన్ అద్భుతంగా బ్యాటింగ్ చేశారు.. ముఖ్యంగా సూర్య తిరిగి ఫామ్ లోకి రావడం నాకు చాలా సంతోషంగా ఉందని రోహిత్ శర్మ తెలిపాడు. వీరిద్దరిలో ఎవరో ఒకరు ఆఖరి వరకు ఉండి ఉంటే మేము విజయం సాధించేవాళ్లం.. కానీ ఆఖరి ఓవర్ లో ఆర్షదీప్ సింగ్ బౌలింగ్ అద్భుతంగా వేయడంతో మేం మ్యాచ్ ఓడిపోవాల్సి వచ్చింది.. కానుక ఈ క్రెడిట్ మొత్తం అతినికే దక్కాలి అని రోహిత్ శర్మ పేర్కొన్నాడు.

Exit mobile version