NTV Telugu Site icon

Rohit Sharma Records: ప్రపంచకప్ చరిత్రలోనే ‘ఒకే ఒక్కడు’ రోహిత్ శర్మ.. తొలి కెప్టెన్‌గా అరుదైన రికార్డు!

Rohit Sharma

Rohit Sharma

Rohit Sharma first Indian to win 2 POTM award in World Cup 2023: భారత కెప్టెన్, హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డును తన పేరుపై లిఖించుకున్నాడు. వన్డే ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌పై ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్న తొలి కెప్టెన్‌గా నిలిచాడు. ఈ రికార్డు ఇప్పటివరకు ఏ కెప్టెన్ సాధించలేదు. ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా ఆదివారం లక్నోలో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడిన విషయం తెలిసిందే. కీలక సమయంలో 101 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సులతో 87 రన్స్ చేశాడు. దాంతో రోహిత్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ దక్కింది.

హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ మరో రికార్డును కూడా ఖాతాలో వేసుకున్నాడు. వన్డే ప్రపంచకప్ చరిత్రలో ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అందుకున్న ఓల్డెస్ట్ కెప్టెన్‌గా రోహిత్ రికార్డుల్లో నిలిచాడు. 36 ఏళ్ల వయసులో హిట్‌మ్యాన్ ఈ ఫీట్ సాధించాడు. ప్రపంచకప్‌ 2023లో రోహిత్‌కు ఇది రెండో ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’. దాంతో ఈ ఫీట్ సాధించిన తొలి భారత ఆటగాడిగా రోహిత్ నిలిచాడు.

Also Read: Ballon d’Or 2023: లియోనల్‌ మెస్సీకి మరోసారి ‘బాలన్‌ డి ఓర్‌’ అవార్డు.. ఏకంగా ఎనిమిదోసారి!

కెప్టెన్‌గానే కాదు బ్యాటింగ్‌లోనూ రోహిత్ శర్మ 52 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టాడు. వన్డే క్రికెట్ చరిత్రలో ఒకే ఏడాదిలో 100 ఫోర్లు, 50 సిక్సర్లు బాదిన తొలి ఆటగాడిగా రోహిత్ నిలిచాడు. వన్డే చరిత్రలోనే ఏ క్రికెటర్ కూడా ఈ ఫీట్ సాధించలేదు. మరోవైపు రోహిత్ ఇటీవలే క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ వన్డే ప్రపంచకప్‌ రికార్డు బ్రేక్ చేసిన విషయం తెలిసిందే. వన్డే ప్రపంచకప్‌లో అత్యధిక సెంచరీలు బాదిన ఆటగాడిగా రోహిత్ అగ్రస్థానంలో నిలిచాడు. 2019 వన్డే ప్రపంచకప్‌ నుంచి రోహిత్ అద్భుతంగా ఆడుతున్న విషయం తెలిసిందే.