Site icon NTV Telugu

Rohit Sharma: వన్డే వరల్డ్ కప్ 2027లో రోహిత్ ఆడతాడా? క్లారిటీ ఇచ్చిన హిట్‌ మ్యాన్

Rohit Sharma

Rohit Sharma

Rohit Sharma: హిట్ మ్యాన్.. ఈ పేరు వినగానే అభిమానుల్లో గూస్‌బంప్స్ వచ్చేస్తాయి. బ్యాంటింగ్‌లోకి దిగాడంటే ప్రత్యేర్థులకు చుక్కలు చూపిస్తాడు రోహిత్. అయితే.. స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ భవిష్యత్‌పై చాలా కాలంగా చర్చ జరుగుతోంది. 2027లో జరగబోయే వన్డే వరల్డ్ కప్‌లో రోహిత్ ఉంటాడా? అనే సందేహాలు మొదలవుతున్నాయి. ఎందుకంటే.. వన్డే వరల్డ్ కప్ సమయానికి రోహిత్ వయసు 40కి చేరుతుంది. అందుకే ఆ టోర్నీలో రోహిత్ ఆడతాడా? లేదా? అన్న సందేహాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే టీ20లు, టెస్ట్‌లకు వీడ్కోలు పలికిన రోహిత్ ప్రస్తుతం కేవలం వన్డే ఫార్మాట్‌లో మాత్రమే భారత్ తరఫున ఆడుతున్నాడు. 2024లో టీ20 వరల్డ్ కప్ గెలిచిన వెంటనే టీ20లకు గుడ్‌బై చెప్పాడు. గత ఏడాది మేలో టెస్ట్ క్రికెట్‌కూ రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇప్పుడు దృష్టి మొత్తం 50 ఓవర్ల ఆటపైనే ఉంది. ఈ నేపథ్యంలో రోహిత్ క్లారిటీ ఇచ్చాడు.

READ MORE: Naravane Book: నరవణే బుక్‌పై అంతర్జాతీయ కుట్ర.. కేంద్ర దర్యాప్తులో ఏం తేలిందంటే..!

అయితే.. తాజాగా ఐసీసీ నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన రోహిత్.. “నా దేశం కోసం వరల్డ్ కప్ గెలవాలని నా మనసులో ఎప్పటినుంచో ఉంది. చిన్నప్పటి నుంచి నేను 50 ఓవర్ల వరల్డ్ కప్ కోసం ఎదురు చూశాను. ఎందుకు కంటే నా చిన్నప్పుడు టీ20 వరల్డ్ కప్ లేదు, ఐపీఎల్ లేదు. నాలుగేళ్లకోసారి జరిగే ఆ టోర్నమెంట్‌నే క్రికెట్‌లో అగ్రస్థానంగా భావించేవాళ్లం. ఆ ట్రోఫీకి చాలా విలువ ఉండేది. నాకు ఆ ట్రోఫీ కావాలి. దాని కోసం నా శక్తిమేరకు కష్టపడతాను” అని స్పష్టం చేశాడు. ఈ వ్యాఖ్యలతో 2027 వరల్డ్ కప్‌పై రోహిత్ లక్ష్యం స్పష్టమైంది. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియాలో జరగబోయే ఆ టోర్నమెంట్‌లో ఆడేందుకు తాను ఫిట్‌గా ఉండటానికి ప్రయత్నిస్తానని సంకేతాలు ఇచ్చాడు. వయసు పెరుగుతున్నా, తనపై నమ్మకం కోల్పోలేదని తేల్చి చెప్పాడు.

READ MORE: Instant Oats Idli Recipe: బియ్యం లేకుండా హెల్తీ ఇడ్లీ.. 15 నిమిషాల్లో ఓట్స్‌తో మృదువైన ఇన్‌స్టంట్ ఇడ్లీలు రెడీ!

Exit mobile version