Site icon NTV Telugu

ICC: ఛాంపియన్స్ ట్రోఫీ టీంలో రోహిత్‌కు దక్కని చోటు.. ఫ్యాన్స్ ఫైర్

Rohit

Rohit

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టీమ్ ఆఫ్ ద టోర్నమెంట్‌ను ఐసీసీ (ICC) ప్రకటించింది. ఇందులో టీమిండియా నుంచి ఆరుగురికి చోటు దక్కింది. అయితే.. అందులో కెప్టెన్ రోహిత్ శర్మ లేకపోవడం ఆశ్చర్యకరం. ఈ టోర్నీలో అద్భుతంగా కెప్టెన్సీ చేసి ఒక్క ఓటమి లేకుండా.. ఫైనల్ వరకు చేర్చి కప్ సాధించాడు. అయితే రోహిత్ శర్మ పేరు లేకపోవడంతో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Read Also: Posani Krishnamurali: పోసాని కృష్ణ మురళి కస్టడీ పిటిషన్ డిస్మిస్

కెప్టెన్‌గా న్యూజిలాండ్ కెప్టెన్ సాంట్నర్‌ను తీసుకుంది. ఇండియా నుంచి విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, మహమ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ (12వ ప్లేయర్) లకు చోటిచ్చింది. అలాగే న్యూజిలాండ్ ఓపెనర్ రచిన్ రవీంద్ర, అఫ్గానిస్తాన్‌కు చెందిన ఇబ్రహీం, అజ్మతుల్లా, ఫిలిప్స్, హెన్రీలను మిగతా సభ్యులుగా చేర్చింది.

Read Also: Rain Alert: ఈ రాష్ట్రాలకు చల్లటి కబురు.. రాబోయే 3 రోజులు భారీ వర్షాలు..!

కాగా.. రోహిత్ కెప్టెన్సీలో భారత్ ఆదివారం ఛాంపియన్స్ ట్రోఫీ-2025 టైటిల్‌ను గెలుచుకుంది. ఫైనల్లో న్యూజిలాండ్‌ను నాలుగు వికెట్ల తేడాతో ఓడించి టీం ఇండియా మూడోసారి ట్రోఫీని కైవసం చేసుకుని, టోర్నమెంట్‌లో అత్యంత విజయవంతమైన జట్టుగా అవతరించింది. కెప్టెన్‌గా రోహిత్‌కు ఇది రెండో ఐసీసీ ట్రోఫీ. దీంతో హిట్ మ్యాన్ ఒకటి కంటే ఎక్కువ ICC ట్రోఫీలను గెలుచుకున్న భారత రెండవ కెప్టెన్ గా హిస్టరీ క్రియేట్ చేశాడు.

Exit mobile version