NTV Telugu Site icon

Rohan Bopanna Retirement: భారత జెర్సీలో చివరి మ్యాచ్‌ ఆడేశా: రోహన్‌ బోపన్న

Rohan Bopanna Retirement

Rohan Bopanna Retirement

Rohan Bopanna Retires From India Tennis: భారత టెన్నిస్‌ దిగ్గజం రోహన్‌ బోపన్న తన సుదీర్ఘ కెరీర్‌కు వీడ్కోలు పలికారు. భారత్‌ తరఫున తన చివరి మ్యాచ్‌ను ఆడినట్టు చెప్పారు. పారిస్‌ ఒలింపిక్స్‌ 2024లో శ్రీరామ్‌ బాలాజీతో కలిసి పురుషుల డబుల్స్‌ బరిలోకి దిగిన బోపన్న.. తొలి రౌండ్‌ కూడా దాటలేకపోయారు. భారత్ జోడీ తమ ఆరంభ మ్యాచ్‌లో 7-5, 6-2తో మోన్‌ఫిల్స్‌-రోజర్‌ వాజెలిన్‌ (ఫ్రాన్స్‌) జంట చేతిలో పరాజయం పాలైంది. మ్యాచ్‌ అనంతరం 44 ఏళ్ల బోపన్న మాట్లాడుతూ.. దేశం తరఫున ఇదే తన చివరి మ్యాచ్‌ అని తెలిపారు.

‘భారతదేశం తరఫున ఇదే నా చివరి మ్యాచ్. నేను ఏ స్థితిలో ఉన్నానో ఈరోజు అర్థమైంది. ఇకపై కుదిరినంత కాలం టెన్నిస్‌ సర్క్యూట్‌ను ఆస్వాదిస్తా. రెండు దశాబ్దాల పాటు భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తానని కలలో కూడా అనుకోలేదు. 2002తో మొదలుపెట్టి ఇప్పటివరకు భారత్‌కు ఆడినందుకు ఎంతో గర్విస్తా’ అని రోహన్‌ బోపన్న చెప్పారు. దేశం తరఫున రిటైర్మెంట్‌ ప్రకటించినా ప్రొఫెషనల్‌ గ్రాండ్‌స్లామ్‌, ఏటీపీ టోర్నీలలో మాత్రం కొనసాగనున్నారు.

Also Read: Manchu Vishnu-Meena: మంచు విష్ణు కీలక నిర్ణయం.. ప్రశంసించిన మీనా!

1996లో అట్లాంటా ఒలింపిక్స్‌లో లియాండర్ పేస్ సింగిల్స్ కాంస్య పతకాన్ని సాధించారు. అప్పటి నుంచి భారత టెన్నిస్‌లో మరో పతకం లేదు. 2016లో మిక్స్‌డ్ ఈవెంట్‌లో రోహన్‌ బోపన్న, సానియా మీర్జా జోడీ నాలుగో స్థానంలో నిలిచి తృటిలో పతకం మిస్ అయ్యారు. డేవిస్ కప్ 2010లో రికార్డో మెల్లోపై విజయం సాధించడం తన కెరీర్‌లో టాప్ మూమెంట్‌గా బోపన్న ఎంచుకున్నారు.

 

Show comments