NTV Telugu Site icon

Roger Federer: దిగ్గజ టెన్నిస్ ఆటగాడిపై డాక్యూమెంటరీ.. స్ట్రీమింగ్ ఎక్కడ, ఎప్పుడంటే..?

Federar

Federar

టెన్నిస్ అనే పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చేవారిలో ‘రోజర్ ఫెదరర్’ ఒకరు. తన కెరీర్‌ లో 20 గ్రాండ్‌స్లామ్‌లు గెలిచిన స్విస్ దిగ్గజ ఆటగాడు 2022లో ప్రొఫెషనల్ టెన్నిస్‌ కు రిటైర్మెంట్ ఇచ్చేసిన సంగతి తెలిసిందే. టెన్నిస్ గేమ్‌ కు వీడ్కోలు పలికిన అతను ప్రస్తుతం తన కుటుంబంతో గడుపుతున్నాడు. ఇకపోతే, ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ స్పోర్ట్స్ లెజెండరీ ప్లేయర్‌ పై ఓ డాక్యుమెంటరీని రూపొందించనుంది. ఇప్పుడు “ఫెడరర్” అనే పేరుతో ఉన్న డాక్యుమెంటరీకి “ది లాస్ట్ 12 డేస్” అనే ఉపశీర్షికను ఎంపిక చేసారు. తాజాగా ఈ డాక్యుమెంటరీ విడుదల తేదీని కూడా అమెజాన్ ప్రైమ్ ప్రకటించింది.

Ajit Pawar: రాజ్యసభ బరిలో అజిత్ పవార్ భార్య సునేత్రా పవార్..

ఈ డాక్యుమెంటరీ జూన్ 20న ప్రసారం కానుందని ఫెదరర్ ప్రకటించారు. ఆసిఫ్ కపాడియా, జో సబియా ఈ డాక్యుమెంటరీకి దర్శకులు. 1998లో టెన్నిస్ ప్రపంచంలోకి అడుగుపెట్టిన ఫెదరర్ తన కెరీర్‌ లో మొత్తం 20 గ్రాండ్‌ స్లామ్లు సాధించాడు. అతను 6 సార్లు ఆస్ట్రేలియన్ ఓపెన్, 8 సార్లు వింబుల్డన్, 5 సార్లు యూఎస్‌ ఓపెన్ లతోపాటు ఒకసారి ఫ్రెంచ్ ఓపెన్‌ ను గెలుచుకున్న గొప్ప క్రీడాకారుడు. అతను 2008 బీజింగ్ ఒలింపిక్స్‌ లో కూడా డబుల్స్‌ లో ఓ బంగారు పతకాన్ని, 2012 లండన్ ఒలింపిక్స్‌ లో సింగిల్స్‌ లో రజత పతకాన్ని కూడా తన ఖాతాలో వేసుకున్నాడు.

Bihar: విరిగిన కాలుకు ప్లాస్టర్ బదులుగా అట్టపెట్టె.. ఇదేం వైద్యం రా.. బాబు