NTV Telugu Site icon

Robert Vadra: ప్రియాంకా గాంధీపై భర్త రాబర్ట్ వాద్రా కీలక వ్యాఖ్యలు

Priyanka

Priyanka

ప్రియాంకా గాంధీ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ గా ఉంటారనే విషయం తెలిసిందే. అయితే ఇప్పటి వరకు ఆమె ఏ నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేయలేదు. 2019లో అధికారికంగా రాజకీయాల్లోకి ప్రవేశించిన ప్రియాంక ఉత్తరప్రదేశ్ తూర్పుకు AICC ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు.

ఇదిలా వుండగా ప్రియాంకా గాంధీ రాజకీయ భవిష్యత్తుపై ఆమె భర్త రాబర్ట్ వాద్రా కీలక వ్యాఖ్యలు చేశారు.
లోక్ సభలో ఉండేందుకు ప్రియాంకకు అన్ని అర్హతలు ఉన్నాయని, ఆమెను లోక్ సభలో చూడాలనుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈసారి కాంగ్రెస్ ప్రియాంకకు ఆ ఆవకాశం ఇస్తుందని తాను భావిస్తున్నట్లు వెల్లడించారు.

Also Read: Odisha: అయ్యో పాపం.. పెన్షన్ కోసం వెళితే పిల్లలు పుట్టకుండా చేశారే!

ఇక తనకు వ్యాపార దిగ్గజం గౌతమ్ అదానీతో లింకులు ఉన్నాయంటూ కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ చేసిన ఆరోపణలపై రాబర్ట్ వాద్రా స్పందిచారు. తాను రాజకీయాలకు దూరంగా ఉండే వ్యక్తినని బీజేపీ నేతలు తన పేరు ప్రస్తావించినప్పుడు మాత్రమే తాను స్పందిస్తానని చెప్పుకొచ్చారు.

అదానీ, మోదీ ఒకే విమానంలో కూర్చొని ఉన్న ఫోటోలు ఉన్నా మనం వాటి గురించి ఎందుకు ప్రశ్నించకూడదని వాద్రా నిలదీశారు. రాహుల్ గాంధీ దీనిపై సమాధానం అడిగితే ఎందుకు ఇవ్వడంలేదని మండిపడ్డారు. తనకి ఆదానికి సంబంధం ఉన్నట్లు ఆధారాలుకానీ, ఫోటోలు కానీ చూపాలని లేని పక్షంలో స్మృతీ ఇరానీ క్షమాపణలు చెప్పాలని వాద్రా డిమాండ్ చేశారు.