NTV Telugu Site icon

Robbery In Shops: స్వైర విహారం చేసిన దొంగలు.. అనేక షాపుల్లో దోపిడీలు..

Robbery

Robbery

Robbery In Shops: రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో దొంగలు స్వైర విహారం చేశారు. అసలు ఇక్కడ పోలీస్ పెట్రోలియం ఉండదన్న రీతిలో నడి చౌరస్తాలో ఓ షాపు షట్టర్ ను గడ్డపారలతో పెకిలించి పకడ్బందీగా దొంగతనం చేశారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. దాదాపు అనేక షాపుల్లో ఇదే రీతిలో రాత్రికి రాత్రే దొంగలు తెగబడ్డారు. ఇక్కడి పోలీసులకు దొంగలు తామేమిటో నిరూపించుకున్నారు. దొంగలకు సవాల్ విసిరిన ఈ దొంగల స్వైర విహారంతో ఒక్కసారిగా పట్టణంలో భయం అలుముకుంది. పట్టణంలోని నడి చౌరస్తాలో ఉన్న జీయర్ మొబైల్స్ లో దొంగలు షట్టర్ గడ్డపారతో తొలగించి 1,60,000 నగదు తీసుకెళ్లారు. లక్షల రూపాయల విలువచేసే సెల్ ఫోన్లను మాత్రం దొంగలు ముట్టుకోలేదు. ఈ దాడిలో చాలా పకడ్బందీగా తెలివిగా ఆలోచించి సెల్ఫోన్లను చోరీ చేయలేదు.

అదేవిధంగా నేషనల్ మార్ట్, కేకే ఎలక్ట్రానిక్స్, వోల్టాస్ షాప్, పరిగి రోడ్డులోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ట్రేడర్స్ హోల్సేల్ కూల్ డ్రింక్స్ షాపులో 20,000 ఇంకా అనేకచోట్ల నగదును తస్కరించారు. ట్రేడర్స్ లో ఒక కాటన్ సిగరెట్లను దొంగిలించారు. ఈ వరస దొంగతనాలపై పోలీసులకు అనేక ఫిర్యాదులు అందుతున్నాయి. అయితే క్లూస్ టీం వెంటనే రంగంలోకి దిగింది. చోరీ జరిగిన వ్యాపార సముదాయాలలో ఫింగర్ ప్రింట్స్ ను పోలీసులు సేకరించారు. నలుగురు దొంగలు జిఆర్ మొబైల్స్ లో ప్రవేశించినట్టు సీసీ ఫుటేజీలో లభ్యమయింది. ఇంకా పట్టణంలో ఎక్కడెక్కడ చోరీలు జరిగాయో ఏమిటో పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. దాదాపు 5 లక్షల రూపాయల నగదు వరకు చోరీకి గురైనట్లు తెలుస్తోంది. ఓ కారు ఎక్స్ యూవి మహీంద్రా 500లో దర్జాగా వచ్చిన దొంగలు విచ్చలవిడిగా దొంగతనాలు చేశారు. ఈ వ్యవహారంపై మరింత సమాచారం త్వరలోనే తెలుస్తుంది..

ఇకపోతే.. జగద్గిరిగుట్ట పియస్ పరిధిలో ఏటీఎంలో డబ్బులు దొంగలించడానికి దొంగ ప్రయత్నించాడు. చంద్రగిరి నగర్ లో యాక్సిస్ బ్యాంక్ ఎటిఎంలో మిషన్ ను బ్రేక్ చేయడానికి యత్నించాడు దొంగ.. అర్ధరాత్రి రెండు గంటలకు ఏటీఎం మెషిన్ నుండి డబ్బులు దొంగలించడానికి యత్నం చేసాడు. ఏటీఎం మెషిన్ డోర్ తెచ్చుకోకపోవడంతో కేటుగాడు వెనుతిరిగాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు..