NTV Telugu Site icon

Theft in Own House : సొంతింటికే కన్నం వేశాడు.. కారం చల్లి కప్పి పుచ్చాలనుకున్నాడు.. కానీ

New Project (12)

New Project (12)

Theft in Own House : స్నేహితుల సహకారంతో సొంత ఇంట్లోనే ఓ యువకుడు దోపిడీకి పాల్పడ్డారు. ఎవరికీ అనుమానం కలుగకుండా ఫింగర్ ప్రింట్స్ దొరకకుండా కారం పొడి కప్పి పుచ్చాలనుకున్నాడు. బంగారం, డబ్బు దోచుకున్న కేసులో ఓ యువకుడు, అతని సహాయకులు అరెస్టయ్యారు. పాలక్కాడ్ పుతుపరియారానికి చెందిన బైజు తన స్నేహితులు సుని, సుశాంత్‌లతో కలిసి దోపిడీకి ప్లాన్‌ చేసి అమలు చేశారు. ఆర్థిక కష్టలను అధిగమించేందుకే సొంత ఇంట్లోనే చొరీ చేశానని హేమాంబిక నగర్ పోలీసులకు బైజు వాంగ్మూలం ఇచ్చాడు.

Read Also : Memory Booster: ప్రతీదీ మర్చిపోతున్నారా.. మీకు అదే కావొచ్చు

బైజూకు తన బంధువులతో సత్సంబంధాలు లేవు. ఈ క్రమంలోనే బంధువులు ఇంటికి తాళం వేసి కొడంగల్లూర్ ఆలయానికి వెళ్లారని తెలుసుకున్నాడు. చాకచక్యంగా చెల్లెలికి ఫోన్ చేసి ఇంట్లో ఎవరూ లేకుండా చూసుకున్నాడు. భారీ మొత్తంలో డబ్బును ఆఫర్ చేసి దోపిడీకి తన వెంట స్నేహితులను తీసుకెళ్లాడు. ఇంటి ముందు తలుపు తెరిచే హక్కు ఉన్నప్పటికీ బైజూ… తలుపులు పగులగొట్టి ఇంట్లోకి ప్రవేశించాడు. ఒక్కో గదిలో ఏయే వస్తువులు భద్రపరిచారో పక్కాగా తెలుసుకుని అల్మారాలు తెరిచాడు బైజు. అందులోని బంగారం, డబ్బు ఎత్తుకెళ్లారు. విచారణను తప్పుదోవ పట్టించేందుకు కారంపొడి చల్లి, అల్మారలోని బట్టలు లాగి చిందరవందర చేసి పరారయ్యాడు. ఈ సీన్ చూసిన ఎవరికైనా ఓ ఎక్స్‌పర్ట్ దోపిడి బృందం ఇంట్లోకి ప్రవేశించి తిరిగి వచ్చిందేమో అనిపించేలా ప్లాన్ చేశాడు. దోపిడీకి అవసరమైన ఆయుధాలను ఇంటి దగ్గర నుంచి సేకరించారు. వాటిని కొద్ది దూరంలోనే పడేశాడు. ఆలయానికి వెళ్లి తిరిగి వచ్చేసరికి చోరీ జరిగిన విషయం కుటుంబ సభ్యులకు తెలిసింది.

Read Also: Shikhar Dhawan : ప్రేమించండి.. కానీ పెళ్లి మాత్రం చేసుకోకండి..

అనంతరం వారు హేమాంబిక పోలీసులను ఆశ్రయించారు. ఇంటి సభ్యులను విచారించగా.. బైజుపై పోలీసులకు కొన్ని అనుమానాలు వచ్చాయి. అనంతరం అతడిని పిలిపించి విచారించగా.. తన ఇంట్లో జరిగిన చోరీ గురించి ఆ యువకుడు వెల్లడించాడు. పోయిన బంగారం, డబ్బును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించేందుకు తన సొంత ఇంటిని తెరిచినట్లు బైజూ వాంగ్మూలం ఇచ్చాడు. ముగ్గురిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.

Show comments