వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కొడంగల్ మండలంలోని చిట్లపల్లి గేటు సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. బొలెరో, కార్ ఎదురెదురుగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురిలో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరిని కొడంగల్ హాస్పిటల్ కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆరోగ్యం విషమించడంతో తండ్రి కూతురు మృతి చెందారు. కార్ కర్ణాటక నుంచి హైదరాబాద్ కు వెళుతున్న క్రమంలో దుర్ఘటన జరిగింది. ప్రమాద సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని ఘటనపై వివరాలు సేకరిస్తున్నారు. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతిచెందడంతో కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.
Vikarabad: ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
- కొడంగల్ మండలంలోని చిట్లపల్లి గేటు సమీపంలో రోడ్డు ప్రమాదం
- ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి

Road