NTV Telugu Site icon

Road Accident: ఖమ్మంలో బస్సు బోల్తా.. 15 మందికి గాయాలు! కొండగట్టులో 11 మందికి గాయాలు

Khammam Road Accident

Khammam Road Accident

15 Injured Khammam Road Accident: తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కూసుమంచి సమీపంలో ఓ ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు బోల్తా పడింది. సూర్యాపేట-ఖమ్మం జాతీయ రహదారిపై లోక్యాతండా వంతెన వద్ద శనివారం తెల్లవారుజూమున ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 15 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు చికిత్స నిమిత్తం క్షతగాత్రులను 108 వాహనంలో ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రైవేటు బస్సు హైదరాబాద్‌ నుంచి రాజమహేంద్రవరం వైపు వెళుతుండగా ప్రమాదం జరిగింది. డ్రైవర్‌ అతివేగమే ఈ ప్రమాదానికి కారణం అని పోలీసులు భావిస్తున్నారు.

Also Read: Komuravelli Temple: కొమురవెల్లి ఆలయం వద్ద భక్తులపై లాఠీచార్జ్!

తెలంగాణలో ఈరోజు మరో రోడ్డు ప్రమాదం కూడా చోటు చేసుకుంది. జగిత్యాల జిల్లా కొండగట్టు ఘాట్ రోడ్డుపై ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 11 మంది ప్రయాణికులు గాయపడ్డారు. గాయపడిన వారిని హుటాహుటిన సమీప ఆస్పత్రికి తరలించారు. అందరూ లక్షెట్టిపేట మండలం మ్యాదరిపేటకు చెందిన వారిగా గుర్తించారు. మహాశివరాత్రి సందర్భంగా కొండగట్టులో దర్శనం అనంతరం ఇంటికి వెళుతుండగా ఈ ఘటన జరిగింది. కొండ నుంచి కిందికి దిగే సమయంలో ఆటో బ్రేక్ ఫెయిల్ అవ్వడంతో ఈ ప్రమాదం జరిగింది.

Show comments