Site icon NTV Telugu

Road Accident: తిరుపతి శ్రీనివాస సేతు ఫ్లైఓవర్‌పై ఘోర ప్రమాదం

Srinivasa Setu

Srinivasa Setu

Road Accident: తిరుపతి శ్రీనివాస సేతు ఫ్లై ఓవర్ పై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. 140 కిలోమీటర్ల వేగంతో ప్లై ఓవర్ ప్రయాణిస్తూ సమయంలో ఎదురగా వచ్చిన మలుపు అంచాన వేయకపోవడంతో ప్లై ఓవర్ గోడను ఢీకొట్టి.. ఎదురుగా వెలుతున్న మరో కారును ఢీకోట్టి బోల్తా పడింది ఓ కారు.. ఈ ఘటనలో నలుగురు యువకుడు తీవ్రంగా గాయపడ్డారు. మరో ఇద్దరు సీటు బెల్ట్ తో పాటు ఎయిర్ బెలూన్‌ ఓపెన్ కావడంతో ప్రాణాలతో బయటపడ్డారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం రుయా హాస్పిటల్ కి తరలించారు. ఫ్లై ఓవర్ పై నిత్యం ప్రమాదాలు జరుగుతున్నా.. ట్రాఫిక్ పోలీసులు దృష్టి సారించిపోవడంతో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. కాగా, గతంలోనూ శ్రీనివాససేతు ఫ్లైఓవర్ పై ప్రమాదాలు జరిగాయి.. ఏడాది క్రితం కూడా ఫ్లైఓవర్ పై వేగంగా దూసుకొచ్చిన రెండు కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఓ కారు ఫ్లైఓవర్ పైనే బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలు అయ్యాయి. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Read Also: Astrology: మార్చి 7, గురువారం దినఫలాలు

Exit mobile version