Site icon NTV Telugu

Road Accident : జర్నీ సినిమా సీన్ రిపీట్.. రెండు బస్సులు ఢీ.. ముగ్గురు మృతి, 30 మందికి గాయాలు..

Accident

Accident

గుజరాత్‌ లోశనివారం నాడు అతివేగంగా వెళ్తున్న బస్సు మరో బస్సును ఢీకొనడంతో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించగా, మరో 30 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటన గుజరాత్‌ లోని సకారియా బస్ స్టేషన్ సమీపంలో జరిగింది. ఈ ఘటనలో మల్పూర్ నుంచి వస్తున్న స్టేట్ ట్రాన్స్‌పోర్ట్ బస్సు డివైడర్‌ ను దూకి మొదాసా నుంచి మల్పూర్‌ కు వెళ్తున్న మరో బస్సును ఢీకొట్టినట్లు సమీపంలోని ఇంట్లోని సీసీటీవీ ఫుటేజీ రికార్డ్ అయిన వీడియో ద్వారా అర్థమవుతోంది.

Chandini Chowdary: ఏంటి చాందిని అలా కుదిరిందా.. లేదా సెట్ చేసుకున్నావా.. ఒకే రోజు రెండు సినిమాలు రిలీజ్..

సకారియా బస్ స్టేషన్ సమీపంలో ఈ ప్రమాదం జరగగా.. ఈ ఘటనలో కొందరు బాటసారులు సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులను ఆదుకునేందుకు పరుగులు తీశారు. క్షతగాత్రులను వెంటనే చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. సమాచారాన్ని అందుకున్న పోలీసులు, అంబులెన్స్ సిబ్బంది అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని వెంటనే సహాయక చర్యలు ప్రారంభించారు. ఎక్కువగా రక్తస్రావమై ముగ్గురు మృతిచెందగా, మరో 30మంది గాయాలతో బయటపడ్డారు. వారిని దగ్గరలోని ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు అధికారులు. ఇక చనిపోయిన వారి మృతదేహాలను పోస్ట్‌మార్టం కు తరలించారు.

Kidney Stone: ఈ నియమాలు పాటించండి.. కిడ్నీలో రాళ్లు తొలగేలా చేయండి

Exit mobile version