Uttarakhand: ఉద్ధృతంగా ప్రవహిస్తున్న గంగా నది..జులై4 వరకూ భారీ వర్షాలు
- గంగలో కొట్టుకు పోయిన పదుల సంఖ్యలో వాహనాలు
- ఉత్తర హరిద్వార్‌లో ప్రజల ఇళ్లలోకి నీరు
- జులై 4 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో గంగ ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. భారీ వర్షాల కారణంగా హరిద్వార్‌లోని ఖర్ఖారీ నదిలో ఆగి ఉన్న వాహనాలు గంగా నదిలో కొట్టుకుపోయాయి. అదే సమయంలో.. ఉత్తర హరిద్వార్‌లో ప్రజల ఇళ్లలోకి నీరు ప్రవేశించింది. ఉత్తరాఖండ్‌లో రుతుపవనాల హెచ్చరికలు జారీ చేశారు. జూన్ 27 న రుతుపవనాలు ఉత్తరాఖండ్‌కు వచ్చాయి. ఇప్పుడు అవి మొత్తం రాష్ట్రాన్ని కవర్ చేశాయి. ఆదివారం నుంచి జులై 4 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. హరిద్వార్‌లో శనివారం మధ్యాహ్నం కురిసిన వర్షం కారణంగా గంగా నది నీటిమట్టం ఒక్కసారిగా పెరిగింది. దీంతో పదుల సంఖ్యలో వాహనాలు నదిలో కొట్టుకుపోయాయి. గంగా నదిలో కొట్టుకుపోతున్న వాహనాలను సెల్ ఫోన్లలో వీడియో తీశారు. వాహనాలలో ఎవ్వరూ లేనందు వల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
READ MORE: Cars Under 5 lakhs: రూ.5లక్షల్లోపు అందుబాటులో ఉన్న కార్లు ఇవే..
Also Read
- Rohit Sharma: రికార్డుల కోట బద్దలు కొట్టిన రోహిత్ శర్మ.. క్రికెట్ హిస్టరీలోనే..
- Modi-Trump: మోడీ-ట్రంప్ ఫోన్ కాల్.. ట్రేడ్, డిఫెన్స్, ఎనర్జీపై కీలక చర్చలు!
- IND Vs WI: హాఫ్ సెంచరీలతో కదం తొక్కిన రోహిత్, గిల్.. శుభారంభం అందించిన ఓపెనర్స్..
- Central Cabinet: కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్.. గ్రీన్ ఎనర్జీ కారిడార్-3కు ఆమోదం..
జూన్ 27న ఉత్తరాఖండ్‌లో రుతుపవనాలు ప్రవేశించాయని.. రాష్ట్రమంతా విస్తరించిందని డెహ్రాడూన్ ఐఎండీ డైరెక్టర్ డాక్టర్ బిక్రమ్ సింగ్ తెలిపారు. రేపటి నుంచి జులై 4 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేశారు. జులై 4 వరకు పిథోరఘర్ బాగేశ్వర్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. వారంలో ఉత్తరాఖండ్‌లోని ఇతర ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.
READ MORE: Sivaji: ఎట్టకేలకు సూపర్ ఛాన్స్ పట్టేసిన శివాజీ
కాగా.. దేశ రాజధాని ఢిల్లీలో కూడా వర్షం బీభత్సం సృష్టిస్తోంది. త రెండ్రోజులగా కుండపోత వర్షం కురవడంతో నగరం గజగజ వణికిపోయింది. రోడ్లు చెరువులను తలపించాయి. డ్రైనేజీలు పొంగిపొర్లాయి. దీంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు. రాకపోకలు జరిగించని పరిస్థితులు ఏర్పాడ్డాయి. సామాన్యుల నుంచి మంత్రులు, ఎంపీల వరకు అందరూ తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గత 88 ఏళ్లలో కురిసిన వర్షం.. తిరిగి గత రెండ్రోజుల్లో కురిసి రికార్డ్ సృష్టించింది. కేంద్ర వాతావరణ శాఖ అంచనాలు కూడా తలకిందులయ్యాయి. దాదాపు 24 గంటల్లో 228 మి.మీ.ల వర్షపాతం నమోదైనట్లుగా ఐఎండీ తెలిపింది. ఇదిలా ఉంటే ఢిల్లీ ఎయిర్‌పోర్టు టెర్మినల్-1 పైకప్పు కూలి ఒకరు చనిపోగా.. పలువురు గాయపడ్డారు. విద్యుత్ షాక్.. గోడ కూలి మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం హస్తిన వాసులు తిరిగి కోలుకుంటుండగా.. మరోసారి శనివారం మధ్యాహ్నం నుంచి పలుచోట్లు భారీ వర్షం కురుస్తుంది. దీంతో వాహనాలు నిలిచిపోవడం వాహనదారులు ఇళ్లకు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నారు.
తాజావార్తలు
-
Revanth Reddy: గత పదేళ్లు సిరిసిల్లను ఉరిసిల్లగా మార్చారు: సీఎం రేవంత్ రెడ్డి
-
Rohit Sharma: రికార్డుల కోట బద్దలు కొట్టిన రోహిత్ శర్మ.. క్రికెట్ హిస్టరీలోనే..
-
Modi-Trump: మోడీ-ట్రంప్ ఫోన్ కాల్.. ట్రేడ్, డిఫెన్స్, ఎనర్జీపై కీలక చర్చలు!
-
IND Vs WI: హాఫ్ సెంచరీలతో కదం తొక్కిన రోహిత్, గిల్.. శుభారంభం అందించిన ఓపెనర్స్..
-
Dhurandhar: ఇదెక్కడి ట్విస్ట్ .. సినిమా రిలీజ్ అయిన మళ్లీ సెన్సార్‌కి వెళ్లిన ‘ధురంధర్’ !
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!