NTV Telugu Site icon

Uttarakhand: ఉద్ధృతంగా ప్రవహిస్తున్న గంగా నది..జులై4 వరకూ భారీ వర్షాలు

New Project (3)

New Project (3)

ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో గంగ ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. భారీ వర్షాల కారణంగా హరిద్వార్‌లోని ఖర్ఖారీ నదిలో ఆగి ఉన్న వాహనాలు గంగా నదిలో కొట్టుకుపోయాయి. అదే సమయంలో.. ఉత్తర హరిద్వార్‌లో ప్రజల ఇళ్లలోకి నీరు ప్రవేశించింది. ఉత్తరాఖండ్‌లో రుతుపవనాల హెచ్చరికలు జారీ చేశారు. జూన్ 27 న రుతుపవనాలు ఉత్తరాఖండ్‌కు వచ్చాయి. ఇప్పుడు అవి మొత్తం రాష్ట్రాన్ని కవర్ చేశాయి. ఆదివారం నుంచి జులై 4 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. హరిద్వార్‌లో శనివారం మధ్యాహ్నం కురిసిన వర్షం కారణంగా గంగా నది నీటిమట్టం ఒక్కసారిగా పెరిగింది. దీంతో పదుల సంఖ్యలో వాహనాలు నదిలో కొట్టుకుపోయాయి. గంగా నదిలో కొట్టుకుపోతున్న వాహనాలను సెల్ ఫోన్లలో వీడియో తీశారు. వాహనాలలో ఎవ్వరూ లేనందు వల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

READ MORE: Cars Under 5 lakhs: రూ.5లక్షల్లోపు అందుబాటులో ఉన్న కార్లు ఇవే..

జూన్ 27న ఉత్తరాఖండ్‌లో రుతుపవనాలు ప్రవేశించాయని.. రాష్ట్రమంతా విస్తరించిందని డెహ్రాడూన్ ఐఎండీ డైరెక్టర్ డాక్టర్ బిక్రమ్ సింగ్ తెలిపారు. రేపటి నుంచి జులై 4 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేశారు. జులై 4 వరకు పిథోరఘర్ బాగేశ్వర్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. వారంలో ఉత్తరాఖండ్‌లోని ఇతర ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.

READ MORE: Sivaji: ఎట్టకేలకు సూపర్ ఛాన్స్ పట్టేసిన శివాజీ

కాగా.. దేశ రాజధాని ఢిల్లీలో కూడా వర్షం బీభత్సం సృష్టిస్తోంది. త రెండ్రోజులగా కుండపోత వర్షం కురవడంతో నగరం గజగజ వణికిపోయింది. రోడ్లు చెరువులను తలపించాయి. డ్రైనేజీలు పొంగిపొర్లాయి. దీంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు. రాకపోకలు జరిగించని పరిస్థితులు ఏర్పాడ్డాయి. సామాన్యుల నుంచి మంత్రులు, ఎంపీల వరకు అందరూ తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గత 88 ఏళ్లలో కురిసిన వర్షం.. తిరిగి గత రెండ్రోజుల్లో కురిసి రికార్డ్ సృష్టించింది. కేంద్ర వాతావరణ శాఖ అంచనాలు కూడా తలకిందులయ్యాయి. దాదాపు 24 గంటల్లో 228 మి.మీ.ల వర్షపాతం నమోదైనట్లుగా ఐఎండీ తెలిపింది. ఇదిలా ఉంటే ఢిల్లీ ఎయిర్‌పోర్టు టెర్మినల్-1 పైకప్పు కూలి ఒకరు చనిపోగా.. పలువురు గాయపడ్డారు. విద్యుత్ షాక్.. గోడ కూలి మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం హస్తిన వాసులు తిరిగి కోలుకుంటుండగా.. మరోసారి శనివారం మధ్యాహ్నం నుంచి పలుచోట్లు భారీ వర్షం కురుస్తుంది. దీంతో వాహనాలు నిలిచిపోవడం వాహనదారులు ఇళ్లకు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నారు.