Rituraj Singh Dies: చిత్ర పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటుడు రుతురాజ్ సింగ్ కన్నుమూత!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anupamaa Actor Rituraj Singh Dies Due To Cardiac Arrest: భారత చిత్ర పరిశ్రమలో ఇటీవలి కాలంలో గుండెపోటుతో మరణించే వారి సంఖ్య పెరిగిపోతుంది. ఇప్పటికే గుండెపోటుతో చాలా మంది చనిపోగా.. తాజాగా టెలివిజన్ నటుడు రుతురాజ్ సింగ్ (59) మరణించారు. మంగళవారం తెల్లవారుజామున ఆయన గుండెపోటుతో కన్నుమూశారు. ఫిబ్రవరి 20 అర్ధరాత్రి 12:30 గంటలకు రుతురాజ్‌కు గుండెపోటు వచ్చిందని ఆయన ప్రియ మిత్రుడు అమిత్ బెహల్ తెలిపారు. రుతురాజ్ సింగ్ మరణంతో బాలీవుడ్లో విషాదం నెలకొంది.
రుతురాజ్ సింగ్ గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ప్యాంక్రియాటిక్ సమస్యల కారణంగా 15 రోజుల క్రితం ఆసుపత్రిలో చేరిన ఆయన.. కోలుకొని ఇటీవల ఇంటికి తిరిగి వచ్చారు. మంగళవారం అస్వస్థతకు గురికావడంతో.. కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రికి వెళ్లేలోపే ఆయన గుండెపోటుతో ప్రాణాలు విడిచారు. రుతురాజ్ సింగ్ మరణవార్త తెలుసుకున్న టెలివిజన్ నటులు, పలువురు సెలబ్రిటీలు సోషల్ మీడియా ద్వారా సంతాపం తెలుపుతున్నారు.
Also Read
Also Read: Operation Valentine Trailer: ఏం జరిగినా సరే చుస్కుంద్దాం.. ‘ఆపరేషన్ వాలెంటైన్’ ట్రైలర్ అదుర్స్!
టీవీ, చలనచిత్ర పరిశ్రమలో రుతురాజ్ సింగ్ మంచి కెరీర్ కలిగి ఉన్నారు. ఇటీవల రూపాలీ గంగూలీ టీవీ సీరియల్ ‘అనుపమ’లో యశ్పాల్ పాత్రలో కనిపించారు. ‘బనేగీ అప్నీ బాత్’ సహా పలు పాపులర్ టెలివిజన్ ధారావాహికల్లో ఆయన నటించారు. యే రిష్తా క్యా కెహ్లాతా హై, త్రిదేవియాన్, దియా ఔర్ బాతీ హమ్ వంటి టీవీ సీరియళ్లలో రీతురాజ్ నటించారు. వరుణ్ ధావన్, అలియా భట్ కలిసి ‘హంప్టీ శర్మ కీ దుల్హనియా’ చిత్రంలో ఆయన నటించారు.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!