NTV Telugu Site icon

Rituraj Singh Dies: చిత్ర పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటుడు రుతురాజ్‌ సింగ్‌ కన్నుమూత!

Rituraj Singh Dies

Rituraj Singh Dies

Anupamaa Actor Rituraj Singh Dies Due To Cardiac Arrest: భారత చిత్ర పరిశ్రమలో ఇటీవలి కాలంలో గుండెపోటుతో మరణించే వారి సంఖ్య పెరిగిపోతుంది. ఇప్పటికే గుండెపోటుతో చాలా మంది చనిపోగా.. తాజాగా టెలివిజన్‌ నటుడు రుతురాజ్‌ సింగ్‌ (59) మరణించారు. మంగళవారం తెల్లవారుజామున ఆయన గుండెపోటుతో కన్నుమూశారు. ఫిబ్రవరి 20 అర్ధరాత్రి 12:30 గంటలకు రుతురాజ్‌కు గుండెపోటు వచ్చిందని ఆయన ప్రియ మిత్రుడు అమిత్ బెహల్ తెలిపారు. రుతురాజ్‌ సింగ్‌ మరణంతో బాలీవుడ్‌లో విషాదం నెలకొంది.

రుతురాజ్‌ సింగ్‌ గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ప్యాంక్రియాటిక్‌ సమస్యల కారణంగా 15 రోజుల క్రితం ఆసుపత్రిలో చేరిన ఆయన.. కోలుకొని ఇటీవల ఇంటికి తిరిగి వచ్చారు. మంగళవారం అస్వస్థతకు గురికావడంతో.. కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రికి వెళ్లేలోపే ఆయన గుండెపోటుతో ప్రాణాలు విడిచారు. రుతురాజ్‌ సింగ్‌ మరణవార్త తెలుసుకున్న టెలివిజన్‌ నటులు, పలువురు సెలబ్రిటీలు సోషల్‌ మీడియా ద్వారా సంతాపం తెలుపుతున్నారు.

Also Read: Operation Valentine Trailer: ఏం జరిగినా సరే చుస్కుంద్దాం.. ‘ఆపరేషన్ వాలెంటైన్’ ట్రైలర్ అదుర్స్!

టీవీ, చలనచిత్ర పరిశ్రమలో రుతురాజ్‌ సింగ్‌ మంచి కెరీర్ కలిగి ఉన్నారు. ఇటీవల రూపాలీ గంగూలీ టీవీ సీరియల్ ‘అనుపమ’లో యశ్పాల్ పాత్రలో కనిపించారు. ‘బనేగీ అప్నీ బాత్’ సహా పలు పాపులర్ టెలివిజన్ ధారావాహికల్లో ఆయన నటించారు. యే రిష్తా క్యా కెహ్లాతా హై, త్రిదేవియాన్, దియా ఔర్ బాతీ హమ్ వంటి టీవీ సీరియళ్లలో రీతురాజ్ నటించారు. వరుణ్ ధావన్, అలియా భట్ కలిసి ‘హంప్టీ శర్మ కీ దుల్హనియా’ చిత్రంలో ఆయన నటించారు.

 

Show comments