Kantara 2 : కాంతారా 2 రిలీజ్ అయ్యేది అప్పుడే.. అప్ డేట్ వచ్చేసిందోచ్
- రూ.100కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న కాంతార చాప్టర్ 1
- సినిమా కోసం హాలీవుడ్ టెక్నీషియన్స్
- అక్టోబర్ 2,2025న విడుదల అంటూ పోస్టర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kantara 2 : కన్నడ స్టార్ రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో నటించిన సినిమా ‘కాంతార’. తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా ఏ స్థాయి విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిన్న సినిమాగా వచ్చిన ‘కాంతార’ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.400 కోట్లను వసూళ్లు చేసి ఔరా అనిపించింది. కొన్ని పదుల రెట్ల లాభాలను నిర్మాతలకు తెచ్చి పెట్టిన కాంతార సినిమాకు సీక్వెల్ రావాలని అభిమానులు కోరుతున్నారు. అంతా కోరుకున్నట్లుగానే కాంతార 2 రాబోతున్న సంగతి తెలిసిందే. కాంతార లో చూపించిన కథకు ముందు జరిగే కథతో కాంతార : చాప్టర్ 1 టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. ‘కాంతార’ను లో బడ్జెట్ మూవీగా తీసుకు వచ్చిన రిషబ్ శెట్టి ఈసారి వంద కోట్లకు మించిన బడ్జెట్‌తో తెరకెక్కిస్తారు. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే శరవేగంగా కొనసాగుతోంది. 2025లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తామని గతంలోనే రిషబ్ శెట్టి ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ విషయమై మరింత స్పష్టత ఇచ్చింది చిత్రయూనిట్. అక్టోబర్ 2, 2025న గాంధీ జయంతి సందర్భంగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన చేస్తూ ఒక పోస్టర్‌ను విడుదల చేసింది చిత్ర బృందం. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమా విడుదల తేదీ రావడంతో అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Read Also:G-20 Summit: బ్రెజిల్ చేరుకున్న భారత ప్రధాని.. జీ-20 సదస్సులో పాల్గొననున్న మోడీ
Also Read
- Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
- Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
- IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్‌ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
- T20 World Cup: టీమిండియా ఘోర ఓటమి.. వరల్డ్ కప్ నుంచి ఔట్..
ఈ మధ్య కాలంలో కాంతార సినిమా నుంచి అప్డేట్ రావడం లేదంటూ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో రిలీజ్ డేట్ ను ప్రకటించడం ద్వారా అభిమానులకు పెద్ద సర్ ప్రైజ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కేవలం కన్నడంలోనే కాకుండా పాన్ ఇండియా రేంజ్లో కాంతార 2 సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. మొదటి పార్ట్ రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన నేపథ్యంలో ప్రీక్వెల్ మూవీకి కచ్చితంగా రూ.1000 కోట్ల వసూళ్లు నమోదు కావడం ఖాయమని చిత్ర బృందం నమ్మకంగా ఉంది. సోషల్ మీడియాలో ఈ సినిమాకు సంబంధించిన చర్చ అప్పుడే మొదలైంది. సినిమా కోసం ఏకంగా హాలీవుడ్ టెక్నీషియన్స్‌ను రంగంలోకి దించుతున్నారు రిషబ్ శెట్టి. ఇదొక హాలీవుడ్ రేంజ్ మూవీగా ఉండబోతుందంటూ హామీ ఇచ్చారు. సోషల్ మీడియాలో సినిమా ఎదురు చూస్తున్నాం అంటూ అన్ని భాషల ప్రేక్షకులు కామెంట్స్ చేస్తున్నారు. అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే విధంగా కాంతార చాప్టర్ 1 సినిమా ఉంటుందని అభిమానులు చాలా నమ్మకంగా ఉన్నారు. రిషబ్ శెట్టి పాత్ర ఎలా ఉంటుంది, కథలో కాంతార ను ఇంకా ఎలా చూపిస్తారు అనేది అందరిలో ఉన్న ప్రశ్నలు. కన్నడ సినిమాలకు పాన్ ఇండియా రేంజ్లో మంచి మార్కెట్ ఉంది. కనుక కాంతార 2 సినిమాకు భారీ వసూళ్లు వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
Read Also:Eknath Shinde: నేను మహారాష్ట్ర సీఎం రేసులో లేను కానీ.. సీఎం ఏక్నాథ్ షిండే సంచలన వ్యాఖ్యలు
తాజావార్తలు
-
Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
-
Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
-
CM Chandrababu : ఐదు రోజుల సీఎం టూర్.. వరుసగా భారీ కార్యక్రమాలు
-
IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్‌ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
-
Nimmala Ramanaidu : జగన్‌వి అన్నీ క్రెడిట్ చోరీ ముచ్చట్లే.. వెలిగొండను పూర్తి చేసేది చంద్రబాబే
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్‌గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!